Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

20, 000 తేనెటీగలతో నిండు గర్భిణీ ఒళ్లు గగుర్పొడిచే సాహసం, బిడ్డ బలి...

బుధవారం, 10 జనవరి 2018 (19:15 IST)

Widgets Magazine
Bee

ఈమధ్య కాలంలో ప్రతి విశేషానికి ఫోటోషూట్‌లు కామనైపోయాయి. మెటర్నిటీ ఫోటోషూట్‌లకు ఈమధ్య బాగా క్రేజ్ పెరిగిపోయింది. వివిధ లొకేషన్లలో అందమైన భంగిమలలో ఫోటోలు తీసుకుని దంపతులు ఆ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే అందరిలా తీసుకుంటే గొప్పేముంది అనుకుందో ఏమిటో ఒక యువతి ఏకంగా 20,000 తేనేటీగలను తన ఒంటిపై వాలేలా చేసి ఫోటోషూట్‌లో పాల్గొని ఆ ఫోటోలు, వీడియోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేసింది. ఇప్పుడు అవి ఇంటర్నెట్లో వైరల్‌గా మారాయి. 
 
వివరాలలోకెళ్తే, యూఎస్‌‌కి చెందిన ఎమిలీ మ్యుయెల్ల‌ర్, త‌న భ‌ర్త ఇద్ద‌రూ క‌లిసి 2015వ సంవ‌త్స‌రంలో మ్యుయెల్ల‌ర్ బీ కంపెనీని స్థాపించారు. ఇప్పుడు ఆ మ‌హిళ నిండు గ‌ర్భ‌వ‌తి. తన ఫోటోషూట్ విలక్షణంగా ఉండాలని భావించిన ఆమె త‌మ తేనెటీగ‌ల ఫారమ్‌కి వెళ్లి, అక్కడ ఉన్న 20,000 తేనెటీగలను తన ఒంటిపై వాలించుకుంది. ఆపై వాటితో ఫొటోషూట్ చేసింది. సాధారణంగా ఒక తేనెటీగ కుడితేనే ఎంతో బాధ, నొప్పి కలుగుతుంది. అలాంటిది ఒక నిండు గర్భిణి అంత‌టి సాహ‌సం చేసినందుకు ఆమెకు నెటిజన్ల నుండి ప్రశంసలు అందాయి. 
 
కానీ దురదృష్టవశాత్తూ 6 రోజులలో పండంటి బిడ్డ పుట్టాల్సి ఉండగా కడుపులో చనిపోవడం అందరినీ కలచివేసింది. తేనెటీగల వలన పిండానికి ప్రమాదం జరిగే దాఖలాలు నిరూపితం కాకపోయినప్పటికీ దీనికి కారణం తెలియాల్సి ఉంది. ఈ సాహసం ఖరీదు ఒక బిడ్డ ప్రాణం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బ్రిటన్ మంత్రివర్గంలో నారాయణమూర్తి అల్లుడు

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు బ్రిటన్ మంత్రివర్గంలో చేరారు. ఆయనతో పాటు ...

news

'హ్యాపీ నారి' పేరుతో రైల్వే స్టేషన్‌లో నాప్కిన్...

హ్యాపీ నారి పేరుతో రైల్వే స్టేషన్‌‌లో తొలిసారి నాప్కిన్స్ అందించనున్నారు. మ‌హిళా ...

news

నా భర్త అతడి తల్లికంటే నన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు... విడాకులు కోరిన మహిళ

ప్రతి భార్యా తన భర్త అందరికంటే ఎక్కువగా తననే ప్రేమించాలని కోరుకుంటుంది. అయితే ఈ మహిళ ...

news

జయలలితకు నోబెల్ బహుమతి ఇవ్వాలి : డిప్యూటీ స్పీకర్

అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి, దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకు నోబెల్ బహుమతి ...

Widgets Magazine