శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2014 (12:22 IST)

గర్భిణీలు పొగతాగితే.. మనవరాండ్రకూ హాని తప్పదట!

ఆధునికత పేరుతో మహిళలు గుప్పుగుప్పున సిగిరెట్ల పొగవదులుతూ స్టేటస్ ఫీలవుతున్నారని సర్వేలు వెల్లడించాయి. పబ్బుల్లో, క్లబ్బుల్లో రింగురింగుల పొగలకు లింగ బేధాలు లేవంటారు. మహిళలు పొగతాగితే ప్రమాదమని ఎన్నో పరిశోధనలు తెలిపాయి. తాజాగా ఓ పరిశోధన గర్భిణీలు పొగత్రాగితే వారి పిల్లలతో పాటు మనవరాండ్రకూ హాని జరుగుతుందని తెలిపాయి.
 
గర్భిణీల పిల్లలకు పొగత్రాగే అలవాటు లేకపోయినా... వారికి పుట్టే పిల్లలకు మామ్మతాగిన పొగ హాని చేకూరుస్తుందని వెల్లడైంది. మహిళలు గర్భిణీలుగా ఉన్న సమయంలో పొగత్రాగితే కచ్చితంగా వారి మనవరాండ్ర జీవితంపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. 
 
వారు ఎముకలు, కండరాలు సంబంధిత వ్యాధుల బారిన పడి కుచించుకుపోయే అవకాశం ఉందని తెలిపారు. మగ పిల్లలు యవ్వన దశలో చేరేసరికి దీని ప్రభావం కచ్చితంగా కనబడుతుందని శాస్త్రవేత్తలు వివరించారు. 
 
వారి కండరాలు పెరగాల్సిన దానికంటే మరింత ఎక్కువ పెరిగి దుష్రభావాలు బయటపడతాయని చెప్పారు. బాలికలైతే పెరగాల్సిన ఎత్తుతో పాటు, బరువులో తీవ్రమైన వ్యత్యాసం వస్తుందని పరిశోధకులు వెల్లడించారు. కనుక పొగ తాగడానికి ఎంత దూరం ఉంటే అంతమంచిదని పరిశోధకులు తెలిపారు