శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : గురువారం, 21 మే 2015 (12:24 IST)

25 ఏళ్ల తర్వాత దక్షిణ కొరియా కొత్త ప్రధాని ప్లేస్ భర్తీ.. హాంగ్ కో అన్ ఎంపిక..

గత 25 ఏళ్లుగా ఖాళీగా ఉన్న దక్షిణ కొరియా ప్రధాని పదవి భర్తీ అయింది. లంచం తీసుకున్నారన్న ఆరోపణలతో దక్షిణ కొరియా ప్రధాని పదవికి లీ వాన్ కూ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆ స్థానంలో ఎవరూ ప్రధాని కాలేదు. ఈ స్థితిలో కొత్త ప్రధానిగా హాంగ్ కో అన్ పేరును దేశాధ్యక్షురాలు పార్క్ గ్యూన్ హై సూచించారు. 
 
ప్రస్తుతం హాంగ్ కో న్యాయశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధ్యక్షురాలు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఓ న్యాయశాఖ మంత్రి ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తుండటం దక్షిణ కొరియా చరిత్రలో ఇదే ప్రధమం కావడం గమనార్హం.