శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (07:33 IST)

రూ.కోట్ల ఆస్తి కొడుకులకు రాసిచ్చి.. నిరుపేద ప్రేయసి వద్దకు చేరిన కోటీశ్వరుడు

అతనో కోటీశ్వరుడు. స్పెయిన్‌ దేశంలో ఉన్న వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆయన చైనాకు చెందిన ఓ వింతంతు మహిళపై మనసుపడ్డాడు. ఇందుకోసం తన కోట్లాది రూపాయల ఆస్తి అడ్డుగా వచ్చింది.

అతనో కోటీశ్వరుడు. స్పెయిన్‌ దేశంలో ఉన్న వ్యాపారవేత్తల్లో ఒకరు. ఆయన చైనాకు చెందిన ఓ వింతంతు మహిళపై మనసుపడ్డాడు. ఇందుకోసం తన కోట్లాది రూపాయల ఆస్తి అడ్డుగా వచ్చింది. తాను మనసుపడిన ప్రేయసిని వదిలిపెట్టలేక... తనకున్న రూ.కోట్ల ఆస్తిని వదులుకున్నాడు. ఆ ఆస్తినంతా తన కుమారులపై రాసిచ్చి.. తాను మాత్రం కట్టుబట్టలతో ప్రేయురాలి చెంతకు చేరుకున్నాడు. అక్కడ ఓ వసతి గృహాన్ని నడుపుతూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్న ఆ అపర ప్రేమికుడి కథను పరిశీలిద్దాం. 
 
స్పెయిన్‌కి చెందిన 57 ఏళ్ల యో నాన్షన్‌ అనే వ్యక్తి ఓ పారిశ్రామికవేత్త. వ్యాపారాల ద్వారా రూ.కోట్ల ఆస్తిని కూడబెట్టాడు. గత యేడాది తన పరిశోధన బృందంతో కలిసి యో నాన్షన్ చైనాలో పర్యటించాడు. ఆ సమయంలో జిజియాంగ్‌లోని ఓ మారుమూల గ్రామంలో లూ లిజియన్ అనే మహిళను కలిశాడు. లూ పేదరికంలో ఉన్న వితంతు రైతు. ఆమెకో కూతురు ఉంది. ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోంది. అయినా లూ ధైర్యంగా జీవితాన్ని కొనసాగిస్తోంది. ఆమెను చూసిన యో ఆమెపై మనసు పారేసుకున్నాడు. 
 
అదేవిషయం లూకి తెలిపాడు. ఆయన్ను చేసుకుంటే లూ ఆర్థిక సమస్యలన్నీ తీరుపోయేవే. కానీ.. అందుకు ఆమె ఒప్పుకోలేదు. సకల సౌకర్యాలతో సంతోషంగా ఉండే ఆ సంపన్నుడినైన యోపై తన సమస్యలను మోపడం ఇష్టం లేక అతని ప్రేమను తిరస్కరించింది. దీంతో స్పెయిన్‌కి తిరిగి వెళ్లిపోయిన యో తన ఆస్తులన్నీ.. కుమారుల పేరుపై రాసిచ్చి.. కట్టుబట్టలపై నెలరోజులోపే తిరిగి లూ ఇంటికి వచ్చేశాడు. యో ప్రేమను అర్థం చేసుకున్న లూ అతని భర్తగా అంగీకరించింది. ప్రస్తుతం వారిద్దరు వారి గ్రామంలోనే వసతి గృహాన్ని నిర్వహిస్తూ.. సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు.