శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (11:49 IST)

నేపాల్‌ టూర్ సక్సెస్.. కీలక ఒప్పందాలు కుదిరాయ్!: సుష్మ

నేపాల్‌లో తన మూడు రోజుల పర్యటన విజయవంతం అయిందని భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ అభివర్ణించారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య అనేక కీలక ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. 
 
విద్యుత్ వాణిజ్య ఒప్పందం ఖరారైందని, అలాగే 1950లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాన్ని కూడా వాస్తవానుగుణంగా సమీక్షించాలని నిర్ణయించినట్లు స్వదేశానికి బయలుదేరే ముందు త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పేర్కొన్నారు. 
 
అనేక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకునేందుకు కృషి చేయాలని నిర్ణయించుకున్నామని, ఈ దిశగా ఎలాంటి అవరోధాలు తలెత్తినా వాటిని చర్చల ద్వారా తొలగించుకోవాలనీ సంకల్పించినట్లు ఆమె వెల్లడించారు. 
 
ఈ మూడు రోజుల పర్యటన సందర్భంగా నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్, ప్రధాని సుశీల్ కొయిరాలాలతో సుష్మా స్వరాజ్ సమావేశమయ్యారు. అలాగే నేపాల్ మావోయిస్టు నాయకుడు ప్రచండతో కూడా మంతనాలు జరిపారు.