శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 మార్చి 2017 (15:13 IST)

రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శిస్తే మరణమే...? కారణమేంటి?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శించిన వారు ఇకపై బతికిబట్టకట్టే అవకాశాలే లేవట. ఇప్పటివరకు ఆయనను విమర్శించిన వారంతా అలాగే చనిపోయారట. అంటే... పుతిన్‌తో గొడవపడినవారంతా ఏదోఒక హింసాత్మక ఘటనలోనో అను

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విమర్శించిన వారు ఇకపై బతికిబట్టకట్టే అవకాశాలే లేవట. ఇప్పటివరకు ఆయనను విమర్శించిన వారంతా అలాగే చనిపోయారట. అంటే... పుతిన్‌తో గొడవపడినవారంతా ఏదోఒక హింసాత్మక ఘటనలోనో అనుమానాస్పద పరిస్థితుల్లోనో మరణించినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 
 
తాజాగా.. ఉక్రెయిన్‌లో ఆశ్రయం కోరిన ఓ రష్యన్‌పై పట్టపగలు జరిగిన కాల్పుల ఘటన వెనుక క్రెమ్లిన్‌ హస్తం ఉందనే హాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. రష్యా కమ్యూనిస్టు పార్టీ మాజీ సభ్యుడిపై కీవ్‌ ఆఫ్‌ డెనిస్‌ వోరోనెంకోవ్‌లో జరిగిన కాల్పుల ఘటనను రష్యా ప్రభుత్వ ఉగ్రవాద చర్యగా ఉక్రెయిన్‌ అధ్యక్షులు పెట్రో పోరోషెంకో అభివర్ణించారు. అయితే.. ఈ ఆరోపణలు అసంబద్ధమంటూ పుతిన్‌ అధికార ప్రతినిధి ఖండించారు. 
 
పుతిన్‌ను విమర్శించిన తర్వాత అనుమానాస్పద రీతిలో మరణించిన వారిలో.. బోరిస్‌ నెమ్‌ట్సోవ్‌(2015), బోరిస్‌ బెరెజోవ్‌స్కీ(2013), స్టానిస్లావ్‌ మార్కెలోవ్‌, అంటాసియా బబురోవా(2009), సెర్గీ మ్యాగ్నిట్‌స్కీ(2009), నటాలియా ఎస్టెమిరోవా(2009), అన్నా పొలిటికోవాస్కాయ(2006), అలెగ్జాండర్‌ లిట్వినెంకో(2006), సెర్గీ యుషెంకోవ్‌(2003), యురి ష్చెకోకిఖిన్‌(2003)లు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.