Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

డొనాల్డ్ ట్రంప్ హెయిర్ స్టైల్ సీక్రెట్ ఏంటంటే? వ్యాయామం + డ్రగ్స్ తీసుకోవడమే

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (13:20 IST)

Widgets Magazine

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటేనే ప్రస్తుతం ప్రపంచ దేశాలు గుర్రుగా ఉన్నాయి. హెచ్-1బీ వీసా చట్ట సవరణ రూపంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎదురుకాబోతున్న ముప్పుకు భారత ఐటీ దిగ్గజాలన్నీ గజగజలాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే ముస్లింలపై కొరడా ఝుళిపించిన డొనాల్డ్ ట్రంప్‌పై సిరియా ప్రాంత ప్రజలు తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఇలా ఎవ్వరికీ భయపడకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న డొనాల్డ్.. తన హెయిర్ స్టైల్ మీద ప్రత్యేక కేర్ తీసుకుంటారని తెలిసింది. 
 
డొనాల్డ్ ట్రంప్ అందమైన హెయిర్‌స్టైల్‌ను మెయిన్‌టైన్ చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డా.హరాల్డ్‌ బార్న్‌స్టెయిన్‌ ట్రంప్ హెయిర్ స్టైల్ సీక్రెట్‌ను బయటపెట్టారు. జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు రోజూ వ్యాయామం చేయడమే కాదు జుట్టు పెరుగుదల కోసం ప్రోస్టేట్‌ సంబంధిత డ్రగ్‌ను తీసుకుంటారని హరాల్డ్ తెలిపారు. అలాగే చర్మ వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ఆంటీ బయోటిక్స్ మందులు కూడా తీసుకుంటారని..  గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచేందుకు మందులు వాడతారని హరాల్డ్ తెలిపారు.
 
ఇకపోతే.. సాధారణంగా శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ డీహెచ్‌టీగా మారుతుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందకుండా డీహెచ్‌టీ అడ్డుపడుతుంది. దాంతో ఎక్కువగా పురుషుల్లో జుట్టు రాలిపోయి బట్టతల ఏర్పడుతుంది. అందుకే టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ 'డీహెచ్‌టీ'గా మారకుండా ఉండేందుకు వీలుగా డ్రగ్‌ను ట్రంప్ తీసుకుంటారని హరాల్డ్ తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

బాహుబలి అవతారంలో హరీష్ రావత్.. ఉత్తరాఖండ్‌ను ఎత్తేశాడు.. మోడీ అవాక్కయ్యారు..

దేశంలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. అందులో ఉత్తరాఖండ్ కూడా ఒకటి. ...

news

సీల్డు కవర్.. సీఎం చాంబర్.. సేఫ్ లాకర్... మంత్రిగారి భవితవ్యం భద్రం.. ఎవరాయన?

ఓ సీల్డు కవర్. అందులే ఆ మంత్రివర్యుని భవితవ్యం. ముఖ్యమంత్రి చంద్రబాబు నిశితంగా పరిశీలించి ...

news

బీటెక్ పట్టభద్రుడి సోషల్ ఫ్రాడ్ ... 'క్లిక్కులు.. లైక్‌'ల పేరుతో రూ.3700 కోట్లు దోచేశాడు.. ఎలా?

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ బీటెక్ పట్టభద్రుడు సోషల్ ఫ్రాడ్‌కు పాల్పడ్డాడు. క్లిక్కు, ...

news

అటవీశాఖామంత్రిగా నారా లోకేష్‌..? బొజ్జల పదవి అనుమానమే..!

ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు అనుకున్నదే చేస్తున్నారు. తన కుమారుడిని ఎప్పటి నుంచో ...

Widgets Magazine