శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (13:57 IST)

స్త్రీలపై వేధింపులు లైవ్‌ షార్ట్ ఫిలిమ్: రేప్ చేస్తామంటూ బెదిరింపులు! (వీడియో)

అమెరికాలోనూ స్త్రీలకు భద్రత లేదు. ''10 అవర్స్ వాకింగ్ ఇన్ న్యూయార్క్ సిటీ యాజ్ ఏ ఉమెన్'' అనే పేరిట ఆ షార్ట్ ఫిలిం వీడియోను యూట్యూబ్‌లో పెట్టారు. ఈ షార్ట్ ఫిలిమ్‌లో న్యూయార్క్ సిటీలో స్త్రీలపై జరిగే వేధింపులను లైవ్‌గా పిక్చరైజ్ చేసింది హోలాబ్యాక్ అనే సంస్థ.
 
మంగళవారం ఈ వీడియో అప్ లోడ్ చేయగా, పది లక్షలకు పైగా వ్యూస్ వచ్చిపడ్డాయి. ఈ వీడియోలో షొషానా బి రాబర్ట్స్ అనే యువతి ప్రధాన పాత్రధారి. షొషానా న్యూయార్క్ వీధుల గుండా నడుస్తుండగా, ఆమె ముందు ఓ వ్యక్తి బ్యాక్ ప్యాక్ తగిలించుకుని వెళుతుంటాడు. 
 
ఆ బ్యాక్ ప్యాక్ కు ఉన్న కెమెరా ద్వారా ఆమెకు ఎదురైన అనుభవాలను చిత్రీకరించారు. ఇక, షార్ట్ ఫిలిం విషయానికొస్తే... షొషానా బిగ్ యాపిల్ స్ట్రీట్ గుండా వెళుతుండగా 100కు పైగా పిల్లికూతలు వినిపించాయట. నైస్, డామ్, స్వీటీ... ఇలా రకరకాలుగా ఆమెను పలకరించే ప్రయత్నాలు చేశారట. 
 
కాగా, ఈ వీడియో అప్ లోడ్ చేసిన తర్వాత అందులో నటించిన షొషానాను రేప్ చేస్తామంటూ సందేశాలు వచ్చాయని హోలాబ్యాక్ ట్విట్టర్లో పేర్కొంది. బెదిరింపులపై హోలాబ్యాక్ డైరక్టర్ ఎమిలీ మే మాట్లాడుతూ, తమ వీడియో బాగానే ప్రభావం చూపిస్తోందన్న విషయాన్ని ఈ బెదిరింపులే స్పష్టం చేస్తున్నాయని, అయినప్పటికీ, ఈ సమస్యపై మరింతగా పోరాడాలని భావిస్తున్నట్లు చెప్పారు.