గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 9 ఏప్రియల్ 2022 (13:11 IST)

అంతగా ఇష్టపడితే భారత్‌కు వెళ్ళిపోండి.. అధికారం కోసం ఏడుపేంటి?

Maryam Nawaz
Maryam Nawaz
పాకిస్తాన్‌లో ఇమ్రాన్ బలపరీక్ష నేపథ్యంలో టెన్షన్ నెలకొంది. విపక్షాలు ఇమ్రాన్ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడం, జాతీయ అసెంబ్లీని రద్దు చేయడంపై సుప్రింకోర్టు ప్రతికూల తీర్పు ఇచ్చింది. దీనిపై పార్లమెంటులో ఓటింగ్ జరగబోతోంది.
 
పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పిఎంఎల్-ఎన్) ఉపాధ్యక్షులు మరియం నవాజ్, పాకిస్తాన్ ప్రధానికి "అంతగా నచ్చితే" దేశం విడిచి భారతదేశానికి వెళ్లిపోవాలన్నారు. 
 
"ఈ అధికారం పోయిన తరువాత వెర్రివాడిగా మారుతున్న వ్యక్తికి తన సొంత పార్టీనే బహిష్కరించింది. మీరు భారతదేశాన్ని అంతగా ఇష్టపడితే, అక్కడికి వెళ్లి పాకిస్తాన్‌ను విడిచిపెట్టండి" అని చెప్పారు. అధికారం కోసం ఎవరైనా ఏడవడం ఇదే మొదటిసారి' అని పాకిస్తాన్ పార్లమెంటులో ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానానికి ముందు ఆమె అన్నారు.
 
తనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి ముందు ఇమ్రాన్ ఖాన్ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఏ అగ్రరాజ్యమూ భారతదేశానికి షరతులను నిర్దేశించజాలదని, న్యూఢిల్లీ- ఇస్లామాబాద్ రెండూ మంచి సంబంధాలను పంచుకోలేదని అంగీకరించారు.
 
"భారతీయులు ఖుద్దర్ క్వామ్ (చాలా ఆత్మగౌరవం కలిగిన వ్యక్తులు). ఏ అగ్రరాజ్యమూ భారతదేశానికి షరతులను నిర్దేశించజాలదు" అని ఆయన శుక్రవారం అన్నారు. 
 
ఆరెస్సెస్, కాశ్మీర్ వివాదం కారణంగా భారత్‍‌తో పాకిస్థాన్‌కు మంచి సంబంధాలు లేవని నిరాశ చెందానని ఇమ్రాన్ అన్నారు. భారత్, పాకిస్తాన్లు రెండూ కలిసి స్వాతంత్ర్యం పొందాయని, కానీ ఇస్లామాబాద్ను టిష్యూ పేపర్‌గా ఉపయోగించి విదేశీ శక్తుల చేతిలో విసిరివేస్తున్నారని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.