శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2017 (11:28 IST)

అమెరికాలో ఉన్న చెడ్డోళ్లంతా వెళ్ళిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

అమెరికాలో ఎన్నారైలపై వివక్ష పెరిగిపోతుంటే.. ఆ దేశాధ్యక్షుడు మాత్రం తన పనేంటో చేసుకుంటూ పోతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లని అరెస్ట్ చేయడం.. దేశం నుంచి పంపేయడం.. అనేది మామూలుగా చూడకూడదంటున్నా

అమెరికాలో ఎన్నారైలపై వివక్ష పెరిగిపోతుంటే.. ఆ దేశాధ్యక్షుడు మాత్రం తన పనేంటో చేసుకుంటూ పోతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న వాళ్లని అరెస్ట్ చేయడం.. దేశం నుంచి పంపేయడం.. అనేది మామూలుగా చూడకూడదంటున్నారు. అదో మిలటరీ ఆపరేషన్‌ అంటూ పేర్కొ న్నారు. దేశం నుంచి నేరస్తులను పంపించేయడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని ట్రంప్ వ్యాఖ్యానించారు. 
 
అలాగే అమెరికాలో ట్రంప్ అక్రమంగా ఉన్న వాళ్లని తరిమేయాలంటూ తెలిపారు. కొన్ని కంపెనీల సీఈవోలతో మాట్లాడుతూ ట్రంప్ ఈ విషయం చెప్పారు. చెడ్డవాళ్ళందరినీ దేశం నుంచి పంపేయాలనీ- అమెరికాలో అక్రమంగా ఉంటూ నేరాలు చేస్తున్నారనీ ట్రంప్ అన్నారు. డ్రగ్స్ బిజినెస్‌తో పాటు హత్యలు కూడా చేస్తున్నారనీ... వీళ్ళు దేశంలో ఉండడానికి వీల్లేదని ట్రంప్ సీఈవోలతో చెప్పుకొచ్చారు.
 
ఇదిలా ఉంటే.. అమెరికాలోని కేన్సస్‌లో దుండగుడి కాల్పుల్లో కూచిబొట్ల శ్రీనివాస్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై ఎన్నారైలు విచారం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ కుటుంబానికి సంతాపం తెలిపారు. అమెరికాలో ప్రస్తుతం పరిస్థితులు బాగాలేవని వ్యాఖ్యానిస్తున్నారు. వీకెండ్లు బయటకు వెళ్ళినప్పుడు భారతీయులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎవ్వరితోనూ వాగ్వివాదానికి దిగొద్దని ఎన్నారైలు విజ్ఞప్తి చేస్తున్నారు.