శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 20 డిశెంబరు 2014 (13:21 IST)

జపాన్‌‌ను కమ్మేస్తున్న మంచు తుపాను: 11 మంది మృతి

జపాన్‌లో కమ్మేస్తున్న తీవ్ర మంచు తుపాను కారణంగా ఇప్పటి వరకూ 11 మందికి పైగా మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 79 ఏళ్ల వృద్ధుడు ఒకరు మృతి చెందగా, మంచును శుభ్రం చేస్తుండగా 29 ఏళ్ల యువకుడు కూడా మృత్యువాత పడ్డాడు. శీతాకాలంలో ఏర్పడే మంచు తుపానుతో ఇక్కడ వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకున్నట్టు వాతావరణ నిపుణలు పేర్కొంటున్నారు.
 
ఈ తరహా వాతావరణం మరి కొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని వారు తెలిపారు. కాగా చలిగాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జపాన్ ప్రభుత్వం హెచ్చరించింది. గత కొన్ని రోజులుగా ఉత్తర, మధ్య జపాన్‌లో వీచే బలమైన గాలుల కారణంగా వాతావరణంలో మార్పులు చేసుకున్నాయని వారు వెల్లడించారు.