Widgets Magazine

'అల్లా' అన్నా ఆరేళ్ల విద్యార్థి... ఉగ్రవాదిగా ముద్రవేసిన టీచర్

అమెరికాలోని టెక్సాస్, పియర్లాండ్‌లో ఓ ఆరేళ్ళ విద్యార్థి అల్లా అంటూ బిగ్గరగా అరిచాడు. అంతే, అతనో జీహాద్ అన్న అనుమానంతో క్లాస్ టీచర్ పోలీసులకు సమాచారం చేరవేసింది.

allah
pnr| Last Updated: సోమవారం, 4 డిశెంబరు 2017 (10:28 IST)
అమెరికాలోని టెక్సాస్, పియర్లాండ్‌లో ఓ ఆరేళ్ళ విద్యార్థి అల్లా అంటూ బిగ్గరగా అరిచాడు. అంతే, అతనో జీహాద్ అన్న అనుమానంతో క్లాస్ టీచర్ పోలీసులకు సమాచారం చేరవేసింది. దీంతో విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,

ఓ ఆరేళ్ల ముస్లిం బాలుడు అమెరికాలోని పాఠశాల గదిలో ‘అల్లా', ‘బూమ్‌’ అని అరుస్తూ, మిగతావారిని భయాందోళనలకు గురిచేయడంతో, అదే గదిలో పాఠాలు చెబుతున్న టీచర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ విద్యార్థి ఉగ్రవాదని భావించిన మీదటే పోలీసులను పిలిపించినట్టు టీచర్ చెప్పడం గమనార్హం. ఈ ఘటన టెక్సాస్‌లోని పియర్లాండ్‌‌లో జరిగింది.

పియర్లాండ్‌‌లోని ఓ పాఠశాలలో మహ్మద్‌ సులేమాన్‌ అనే విద్యార్థి బుద్ధిమాంద్యంతో బాధపడుతున్నాడు. అతను తరగతిలో ఉన్నసమయంలో అల్లా అంటూ బిగ్గరగా అరిచాడు. అంతే మిగిలిన విద్యార్థులంతా భయాందోళనలకు గురయ్యారు. అదే గదిలో పాఠాలు చెబుతున్న టీచర్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ విద్యార్థి ఉగ్రవాదని భావించిన మీదటే పోలీసులను పిలిపించినట్టు టీచర్ చెప్పడం గమనార్హం.

దీనిపై ఆ విద్యార్థి తండ్రి స్పందిస్తూ, తన కుమారుడు ఓ మానసిక వికలాంగుడని టీచర్‌కు తెలుసన్నారు. ఆమె కాకుండా మరో టీచర్ రావడంతోనే పోలీసులకు ఫిర్యాదు వెళ్లిందని చెప్పాడు. తన కుమారుడికి సరిగ్గా మాటలు కూడా రావని, ఈ ఫిర్యాదు వెనుక జాతి వివక్ష ఉందని ఆరోపించాడు. చిన్న బిడ్డపై ఉగ్రవాదిగా ముద్ర వేయడం ఏంటని ప్రశ్నించాడు.


దీనిపై మరింత చదవండి :