Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రిన్సిపాల్‌ను తిట్టారనీ అమ్మాయిలను నగ్నంగా నిల్చోబెట్టారు

గురువారం, 30 నవంబరు 2017 (14:25 IST)

Widgets Magazine
nude parade

విద్యాబుద్ధులు చెప్పాల్సిన పంతుళ్లు ఉన్మాదులుగా మారిపోతున్నారు. విద్యార్థులు తెలిసోతెలియక చేసే చిన్నపాటి తప్పులకే పెద్దపెద్ద శిక్షలు విధిస్తున్నారు. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. ప్రిన్సిపాల్‌ను దూషించారన్న కారణంతో ఏకంగా 88 మంది విద్యార్థినులను వివస్త్రలను చేసి వరుసగా నిల్చోబెట్టారు. ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
అరుణాచల్‌ ప్రదేశ్‌లోని పాపుమ్‌ పారే జిల్లా తాని హప్ప (ప్రస్తుతం సంగాలీ)లోని కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయంలో చదివే కొంతమంది అమ్మాయిలు ప్రిన్సిపాల్‌కు వ్యతిరేక వ్యాఖ్యాలు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇద్దరు అసిస్టెంట్ టీచర్, ఒక ఉపాధ్యాయుడు విద్యార్థినులపై అమానుషంగా ప్రవర్తించారు. సహచర విద్యార్థుల సమక్షంలోనే 88 మంది అమ్మాయిలను నగ్నంగా నిల్చోబెట్టారు. 
 
ఈ అమానుష సంఘటన ఈనెల 23వ తేదీన జరిగింది. కానీ బయటకు పొక్కలేదు. ఈ నేపథ్యంలో ఈనెల 27వ తేదీన బాధిత విద్యార్థినులు ఆల్‌ సంగాలీ విద్యార్థి సంఘం (ఏఎస్ఎస్‌యు)ను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. ఏఎస్‌ఎస్‌యూ నేతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

రోజా పాదాలు బొబ్బలెక్కాయి..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శ్రీకారం చుట్టిన సంగతి ...

news

'డల్లాస్'లో ఇండియన్ బాలిక హత్య... తొడ ఎముక విరిగింది... అదే జరిగిందా?

ఒక అనాథాశ్రమం నుంచి బాలికను సాకుతామని తీసుకువచ్చి ఆమెను అత్యంత పైశాచికంగా హత్య చేసి ...

news

#GES2017 మీ ఆతిథ్యం చెరిగిపోని జ్ఞాపకం... ఇవాంక

హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధినేత ...

news

అమెరికాతో సమానంగా అణ్వాయుధ సత్తా : ఉత్తర కొరియా

అమెరికా అణ్వాయుధ సాయుధసంపత్తికి సమానంగా తాము అణ్వాయుధాలను సమకూర్చుకున్నట్టు ఉత్తర కొరియా ...

Widgets Magazine