శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr

17 అంతస్తుల భవనం నుంచి దూకేందుకు సిద్ధమైన బాలిక... కాపాడిన ప్రిన్సిపాల్ (Video)

చైనాలో ఓ బాలిక ప్రాణాలను పాఠశాల ప్రిన్సిపాల్ కాపాడి, హీరోగా మారాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

చైనాలో ఓ బాలిక ప్రాణాలను పాఠశాల ప్రిన్సిపాల్ కాపాడి, హీరోగా మారాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
చైనాలోని గైజోవ్ ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థిని తీవ్ర మాన‌సిక ఒత్తిడిలో కూరుకునిపోయింది. దీంతో 17 అంత‌స్తుల భ‌వ‌నం మీద నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని గమనించిన సహచర విద్యార్థులు పాఠ‌శాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. 
 
దీంతో కాపాడ‌టానికి వ‌చ్చిన ర‌క్ష‌ణ సిబ్బందిని ఆ బాలిక‌ ద‌గ్గ‌రికి కూడా రానివ్వ‌లేదు. అయితే మంచినీళ్లు అందిస్తున్నానంటూ ప్రిన్సిపాల్ ఆమె ద‌గ్గ‌రికి వెళ్లి, ఒక్క‌సారిగా చొక్కా ప‌ట్టుకుని బాలిక‌ను వెన‌క్కి లాగి కాపాడాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. 
 
కాగా, విద్యలో ఉత్తీర్ణ‌త మీద ఎక్కువ‌గా దృష్టి సారించే చైనా దేశంలో చాలా మంది పిల్ల‌లు మాన‌సిక ఒత్తిడికి లోన‌వుతున్నార‌ని ఆ దేశ మీడియా పేర్కొంది.