ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 16 ఏప్రియల్ 2021 (19:17 IST)

బాస్‌కు చీపురుతో బుద్ధి చెప్పిన మహిళ.. వీడియో వైరల్

చైనాలో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే మహిళ తనను వేధిస్తున్న బాస్‌కు చీపురుతో బుద్ధి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అసభ్యకర టెక్ట్స్ ను పంపుతున్న బాస్ కు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఆమెను రియల్ హీరోగా నెటిజన్లు కొనియాడారు. 
 
బాస్‌పై నీళ్లు చల్లి, బుక్స్ విసిరేస్తూ చీపురుతో మహిళ దుమ్ము దులుపుతున్న 14 నిమిషాల వ్యవధితో కూడిన వీడియో చైనా సోషల్ మీడియా వీబోలో పలువురిని ఆకట్టుకుంది. చైనాలోని బీలిన్ జిల్లా సిహువా ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చైనా అధికారిక మీడియా వెల్లడించింది. 
 
వీడియోలో బాధిత మహిళను ఝా, నిందితుడిని వాంగ్‌గా గుర్తించారు. వేధింపుల విషయాన్ని పై అధికారులకు వివరించగా తన బాస్ జోక్‌గా టెక్ట్స్ మెసేజ్‌లు పంపానని నమ్మబలికాడని మహిళ చెప్పుకొచ్చారు.