మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (16:32 IST)

ఆత్మహత్యకు యత్నించిన చైత్రా కుటూర్

కన్నడ హీరోయిన్, బిగ్ బాగ్ పోటీదారుడు చైత్రా కుటూర్‌ ఆత్మహత్యకు ప్రయత్నించారు. కోలార్‌‌లోని తన ఇంట్లో ఫినాయల్‌ సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించడంతో ప్రాణపాయం తప్పింది. వివాహ బంధంలోని సమస్యలే ఈ ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది. 
 
కొద్దిరోజుల క్రితం వ్యాపారవేత్త నాగార్జునని పెళ్లిచేసుకున్నానని చెబుతూ చైత్ర కుటూర్‌ సోషల్‌ మీడియాలో ఫోటోని షేర్‌ చేశారు. ఇది వైరల్‌ అయ్యింది. అయితే ఆమెని ఇష్టపడి పెళ్లాడలేదని బలవంతంగా పెళ్లి చేశారని నాగార్జున ఆరోపిస్తున్నాడు. 
 
అలాగే అత్తింటివారు కూడా చైత్రని కోడలిగా అంగీకరించేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకి ప్రయత్నించిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం చైత్రకుటూర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు ఫైల్‌ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.