శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 1 నవంబరు 2014 (16:20 IST)

బిల్ గేట్స్ మొత్తం ఆస్థిని ఖర్చు చేయాలంటే 218 ఏళ్లు పడుతుంది

ప్రపంచంలో అత్యంత ధనికులైన బిల్ గేట్స్ తన ఆస్థిని ఒక రోజుకు ఒక మిల్లియన్ డాలర్లు లెక్కన ఖర్చు చేయాలంటే 218 సంవత్సరాలు పడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. 
 
ఇటీవల ఈ విషయం గురించి ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ఒక అధ్యయనం చేసింది. అందులో మైక్రోసాఫ్ట్ సంస్థ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రోజుకు ఒక మిల్లియన్ డాలర్లు లెక్కన ఆయన ఆస్థిని ఖర్చు చేయాలంటే 218 సంవత్సరాలు పడుతుందని ఆ అధ్యయనం ద్వారా వెల్లడైంది. 
 
ఆ సంస్థ జరిపిన అధ్యయనంలో ఇదే విధంగా ప్రపంచంలో అత్యంత ధనవంతులలో ఒకరైన కార్లెస్ స్లిమ్ ఒక రోజుకు మిల్లియన్ డాలర్ లెక్కన ఖర్చు చేసినట్లైతే ఆయన ఆస్థిని 220 సంవత్సరాలు ఖర్చు చేయవచ్చునని, వారన్ పప్పెట్ ఇదే విధంగా 169 సంవత్సరాలు ఆయన ఆస్థిని ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిసింది. 
 
అదేవిధంగా ఆర్థిక మాద్యం పరిస్థితిలో ప్రపంచ బిలియనర్ల సంఖ్య రెండింతలుగా పెరుగుతుందని ఆ అధ్యయనంలో వెల్లడైనట్టు తెలుస్తోంది.