సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

క్యూకట్టిన ట్రంప్ మద్దతుదారులు.. వైట్‌హౌస్ వద్ద ఉద్రిక్తత

అగ్రరాజ్యం అమెరికాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నవంబరు 3వ తేదీన జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయభేరీ మోగించారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఓడిపోయారు. దీంతో 2021 జనవరి 20న అమెరికా కొత్త అధ్యక్షుడి జోబైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలాహారీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. 
 
ఈ క్రమంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తానే గెలిచానని ప్రకటించుకుని, వైట్‌హోస్‌ను వదిలేది లేదని తేగెసి చెప్పిన ట్రంప్ ఎట్టకేలకు తన నిర్ణయం మార్చుకున్నట్లు తెలుస్తోంది. తనంతటే తానే శ్వేతసౌధాన్ని విడిచేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. 
 
ట్రంప్ ఓటమికి ఎన్నికారణాలున్నా.. డెమొక్రటిక్ పార్టీ కంటే అమెరికాలోని కీలకమైన రాష్ట్రాల్లో రిపబ్లికన్ పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో అమెరికన్ కాంగ్రెస్‌లో రిపబ్లికన్ పార్టీకే అత్యధిక మెజార్టీ దక్కింది. అయినప్పటికీ, కేవలం ఎలక్టరోల్ తక్కువగా రావడంతో ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్‌గా కొనసాగడం కలగానే మిగిలిపోయింది. 
 
ఇదిలాఉంటే, వాషింగ్టన్ రాష్ట్రంలో ట్రంప్‌కు మద్దతుగా వేలాది మంది అమెరికన్ పౌరులు నిరసనకు దిగారు. వైట్‌హౌస్ వద్దకు వారంతా ప్రదర్శనగా వచ్చారు. ట్రంప్‌తోనే అమెరికా గొప్పశక్తిగా అవతరిస్తోందని ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వెలువడిన ఫలితాలపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణం ట్రంప్ హయాంలో అమెరికా పౌరుల హక్కులకు పెద్దపీట వేయడమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
 
వాషింగ్టన్ డీసీలో శనివారం జరిగిన ఈ భారీ ర్యాలీలో డెమొక్రటిక్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మిలియన్ మాగా (మేక్ అమెరికా గ్రేట్ అగైన్) మార్చ్ నిర్వహించారు. 'ట్రంప్ 2020: కీప్ అమెరికా గ్రేట్', 'ట్రంప్ గొప్ప అధ్యక్షుడు', 'స్టాప్ ది స్టీల్' వంటి నినాదాలతో హోరెత్తించారు. ట్రంప్ మద్దతుదారులతో వైట్‌హౌస్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి.