శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 31 డిశెంబరు 2016 (11:06 IST)

కిరియకోస్ హత్యకు భార్యే కారణం.. అక్రమ సంబంధంతోనే హత్యకు పాల్పడిందా?

బ్రెజిల్‌లో గ్రీకు దౌత్యాధికారి కిరియకోస్ అమిరిడిస్ (59) హత్య వెనుక అక్రమ సంబంధం కోణాన్ని పోలీసులు అధికారులు వెలుగులోకి తెచ్చారు. కిరియకోస్ హత్యకు గురికాగా, గురువారం నాడు రియోలో ఓ కారులో దహనమైన స్థితి

బ్రెజిల్‌లో గ్రీకు దౌత్యాధికారి కిరియకోస్ అమిరిడిస్ (59) హత్య వెనుక అక్రమ సంబంధం కోణాన్ని పోలీసులు అధికారులు వెలుగులోకి తెచ్చారు. కిరియకోస్ హత్యకు గురికాగా, గురువారం నాడు రియోలో ఓ కారులో దహనమైన స్థితిలో ఉన్న ఆయన మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ కేసులో కిరియకోస్ భార్య ఒలివెరా (40), ఆమె పోలీసు ప్రియుడు మొరియిరా (29)ల ప్రమేయముందని పోలీసులు చెప్పారు. 
 
మొరియిరా కజిన్ కూడా హత్యకు సహకరించాడని చెప్పుకొచ్చారు. ప్రత్యక్షంగా హత్యలో పాల్గొనకపోయినా, కుట్ర గురించి ఒలివెరాకు విషయం తెలుసునని, డిసెంబర్ 21నుంచి తన భార్యతో కలిసి కిరియకోస్ రియో డీ జనీరో పర్యటనలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
 
వాస్తవానికి ఆయన జనవరి 9న బ్రెజిల్‌కు చేరుకోవాల్సి వుందని తెలిపారు. ఈ కేసులో తొలుత పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తన భర్త టాక్సీలో బయటకు వెళ్లాడని.. కానీ తిరిగి రాలేదని ఒలివెరా తెలిపింది. కానీ పోలీసులు జరిపిన విచారణ నిజం ఏంటో ఒప్పుకుందని పోలీసులు తెలిపారు.