మాజీ భర్తకు వాట్సాప్ మెసేజ్ పంపింది.. అంతే జైలుకు వెళ్లింది..?

Last Updated: గురువారం, 11 జులై 2019 (15:56 IST)
మాజీ భర్తకు వాట్సాప్ మెసేజ్ పంపిన మహిళకు జైలు శిక్ష పడింది. ఇంతకీ ఏం జరిగిందంటే... సౌదీ అరేబియాలో మాజీ భర్తకు మెసేజ్ పంపిన మహిళకు మూడు రోజుల జైలు శిక్ష పడింది. సౌదీకి చెందిన ఓ మాజీ భర్తకు వాట్సాప్ ద్వారా తీవ్ర పదజాలంతో తిడుతూ మెసేజ్‌లు పెట్టింది. ఈ మెసేజ్‌ను చూసిన ఆమె మాజీ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళను అరెస్ట్ చేశారు, విచారణలో ఐదేళ్ల క్రితం ఆమె భర్తకు విడాకులు ఇచ్చినట్లు తెలిసింది. మళ్లీ వీరిద్దరి మధ్య వాగ్వివాదాలు చెలరేగడంతో మహిళ భర్తను తూలనాడిందని తెలిసింది. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు మాజీ భర్తను దూషించిన భార్యకు మూడు రోజుల జైలు శిక్ష విధించింది. కాగా సౌదీలో కఠినమైన చట్టాలు అమల్లో వున్న సంగతి తెలిసిందే. దీనిపై మరింత చదవండి :