శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By PYR
Last Modified: శుక్రవారం, 30 జనవరి 2015 (09:49 IST)

మాతృత్వానికే మచ్చ... ఏడుస్తున్నారని పీక పిసికిన తల్లి

అమెరికా అనగానే అదో భూతల స్వర్గమని భావిస్తారందరూ.. అక్కడ పిల్లలను గిల్లినా కేసే అవుతుందట. చట్టాలు అంత కఠినంగా ఉంటాయని అంటుంటారు. కానీ ఈ మధ్యలో గమనిస్తే.. అక్కడి పిల్లల పట్ల తల్లులు రాక్షుల్లా వ్యవహరిస్తున్నారు. మాతృత్వానికే మచ్చ తెస్తున్నారు. నిన్నటికి నిన్న ఉప్పుతోనే ఓ మహిళ ఐదేళ్ల కొడుకును కడతేర్చింది. ప్రస్తుతం మరో కసాయి తల్లి ఏకంగా ముగ్గురు పిల్లల పీక పిసికి చంపబోయింది. అసలేం జరిగింది. 
 
అమెరికాకు చెందిన క్రిస్టియానా బూత్, థామస్ బూత్లకి ముగ్గురు సంతానం. రెండేళ్ల వయసున్న ఒక పాప, 6 నెలల వయసున్న ఇద్దరు కవలలు ఉన్నారు. సెలవు రోజు పిల్లలు ఏడుస్తున్నారనే చికాకుతో తల్లి క్రిస్టియానా వైద్య సహాయం కోసం పోలీసులకు ఫోన్ చేసింది. వారు ఇంటికి వచ్చే లోపే ఓపిక లేక ఏడ్చుతున్న పిల్లల్ని గొంతు పిసికి హత్యయత్నం చేసింది. 
 
పోలీసులు చేరుకునే సరికి మంచం పై ఉన్న కవలలిద్దరి గొంతు నుంచి రక్తం వస్తూ, వాళ్లు ఏడుస్తూ ఉండటం గమనించారు. మరో పోలీసు అధికారి రెండో అంతస్తు వెళ్లి చూసే సరికి రెండేళ్ల పాప కూడా ఎండిన రక్తపు మరకలతో మంచం పై కనిపించింది. ముగ్గురు పిల్లలను హుటాహుటిన దగ్గర్లోని ఆస్సత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పిల్లల తల్లిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.