శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pyr
Last Updated : బుధవారం, 5 ఆగస్టు 2015 (06:39 IST)

అతి పెద్ద విమానం వచ్చేస్తోంది.... ఎప్పుడు ? ఎక్కడ?

ప్రపంచంలోనే అతి పెద్ద విమానం... ఎంత పెద్దదంటే... ఫుట్‌బాల్‌ మైదానమంత పెద్దది. అమ్మో..! అంత పెద్ద విమానం ఎక్కడైనా ఉంటుందా...! అదే.. రాకెట్లను కక్ష్యలో ప్రవేశపెట్టే ఈ విమానం పేరు ‘స్ట్రాటో లాంచ్‌ కారియర్‌’. బోయింగ్‌ 747-8, ఎయిర్‌ బస్‌ల కంటే పెద్దదైన ఈ విమానం.
 
విమానం టేకాఫ్‌, ల్యాండ్‌ కావడానికి 12,000 అడుగుల రన్‌వే అవసరమవుతుంది. దీనిని 2016లో విమాన పనితీరును పరీక్షించి, 2018లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 6,124 కిలోల బరువు గల రాకెట్లను భూతలం నుంచి 30,000 అడుగుల పైన ఉన్న నిర్ణీత కక్ష్యల్లో ప్రవేశపెడుతుంది. మొదటి, రెండు దశల్లో ఇంజన్‌ నిప్పులు చిమ్ముతూ నింగికి ఎగురుతుంది. మూడో దశలో రాకెట్‌ను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెడుతుంది. రెక్కల 385 అడుగులు (117 మీటర్లు) విస్తరించి ఉంటాయట. 
 
ఆరు జెట్‌ ఇంజన్లు ఉండే ఎయిర్ క్రాఫ్టు బరువు 5,44,311 కిలోలు. గంటకు 850 కిలోమీటర్లు వేగంతో దూసుకుపోతుంది. కాలిఫోర్నియాలోని మొజావె ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ పోర్ట్‌ నందు ‘స్ర్టాటో లాంచ్‌ కారియర్‌’ విమానాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఇది నిర్మాణ దశలోనే ఉంది. మైక్రోసాఫ్ట్‌ సంస్థ స్థాపకుల్లో ఒకరైన పాల్‌ అలెన్‌, స్కాలెడ్‌ కంపెనీ అధినేత రూతన్‌ల ఆలోచనల్లో రూపుదిద్దుకున్నదే ఈ విమానం.