Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఈజిప్టు గిజా పిరమిడ్ల వద్ద ఆ ఇద్దరు.. ఫోటోగ్రాఫర్లు నానా తంటాలు పడ్డారు..

ఆదివారం, 28 జనవరి 2018 (17:41 IST)

Widgets Magazine

ఈజిప్టులోని ప్రపంచ ప్రఖ్యాత పిరమిడ్ల వద్ద ప్రపంచంలో అత్యంత పొడవైన వ్యక్తి.. ప్రపంచంలో అత్యంత పొట్టి మహిళ కలిశారు. పర్యాటకాన్ని ప్రమోట్ చేసే దిశగా వీరిద్దరినీ ఈజిప్టు కలిపింది. గిజా పిరమిడ్ల వద్ద వీరిద్దరూ సందడి చేశారు. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు నానా తంటాలు పడాల్సి వచ్చింది. 
 
ఈజిప్టు పర్యాటకాన్ని ప్రమోట్ చేయడంలో భాగంగా ఈజిప్టు సర్కారు ఈ ఇద్దరితో ప్రచారం నిర్వహించాలనుకుంది. ఇందులో భాగంగా వీరిద్దరూ కైరోలోని చారిత్రక గిజా పిరమిడ్ల వద్ద పర్యాటకులతో కలిసి ఫొటోలకు ఫోజిచ్చారు. ఈజిప్టులోని మరిన్ని పర్యాటక ప్రాంతాల్లోనూ సుల్తాన్ కోసెన్, జ్యోతి అమ్గేలు సందర్శించనున్నారు.
 
కాగా టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ (8 అడుగుల 2.8 అంగుళాల పొడవు) ప్రపంచలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్సిస్ రికార్డులకెక్కాడు. భారత్‌కు చెందిన జ్యోతి అమ్గే 2 అడుగుల 6 అంగుళాల పొడవుతో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది. వీరిద్దరూ 2011లోనే ఈ రికార్డులను సాధించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
World Giza Egypt Sultan Kosen Jyoti Amge Tallest Man Shortest Woman

Loading comments ...

తెలుగు వార్తలు

news

టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై కేసు

విజయవాడ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా సతీమణి సుజాతపై పోలీసులు కేసు నమోదు చేశారు. భూ వివాదమే ...

news

చంద్రుడు.. సూర్యుని రంగులో కనిపిస్తాడట-31న సూపర్ మూన్ తప్పక చూడండి..!

నిత్యం రాత్రి వేళల్లో ఈ లోకానికి వెలుగునిచ్చే చందమామ.. ఈ నెల 31వ తేదీన ఎరుపుగా ...

news

హుదూద్ తుఫాను.. 160 ఏళ్ల నాటి కాశింకోట పాఠశాలను నిర్మించిన రాజమౌళి

బాహుబలి మేకర్ రాజమౌళి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2014లో సంభవించిన ...

news

ట్రంప్ శరీరంలో అద్భుతమైన జన్యువులు.. 200 సంవత్సరాలు జీవిస్తారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గురించి డైట్ హౌస్ వైద్యుడు రోనీ జాక్సన్ నివేదిక ...

Widgets Magazine