Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఐపీఎల్-10.. చివరి లీగ్ మ్యాచ్‌లో పోరాడి ఓడిన ఢిల్లీ-కోహ్లీ సేన గెలుపు

Widgets Magazine
virat kohli

కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పది పరుగుల తేడాతో ఢిల్లీపై గెలుపును నమోదు చేసుకుంది. ఆదివారం జరిగిన ఐపీఎల్-10 చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు నిర్దేశించిన 162 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ పోరాడి ఓడింది. 151 పరుగులు మాత్రమే సాధించింది.
 
ఢిల్లీ ఆటగాళ్లలో రిషభ్‌ పంత్‌ (34 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45) రాణించాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ (32), కరుణ్‌ నాయర్‌ (26) శుభారంభం చేసినా.. భారీ స్కోరు మాత్రం నమోదు కాలేదు. చివర్లో మహ్మద్‌ షమి (21) పోరాడినా ఫలితం దక్కలేదు. బెంగళూరు బౌలర్లలో హర్షల్‌ పటేల్‌, పవన్‌ నేగి మూడేసి వికెట్లు పడగొట్టగా.. ట్రేవిస్‌ హెడ్‌ రెండు వికెట్లు సంపాదించాడు. 
 
అంతకుముందు టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకున్న బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 161 పరుగులు చేసింది. కోహ్లీ (45 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 58), క్రిస్‌ గేల్‌ (38 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 48) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ప్యాట్‌ కమిన్స్‌ రెండు, జహీర్‌, నదీమ్‌ చెరో వికెట్‌‌ను తమ ఖాతాలో వేసుకున్నారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

క్రికెట్

news

ఐపీఎల్ 2017 : పాయింట్ల పట్టిలకలో ముంబై ఇండియన్ టాప్..

ఐపీఎల్ 2017 టోర్నీలో భాగంగా కోల్‌కతాలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. ...

news

విదేశీ ఆటగాళ్ళ బాధ్యతారహిత్యం వల్లే ఓడాం : వీరేంద్ర సెహ్వాగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్టు ఆటగాళ్లపై ఆ జట్టు క్రికెట్‌ ...

news

ముత్తయ్య, ఎంజీఆర్‌లకు మోడీ కితాబు.. శ్రీలంకకు భారత్ పెద్దన్న లాంటివాడన్న స్పిన్నర్..

శ్రీలంక లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్‌పై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రశంసలు ...

news

అర్జున్ టెండూల్కర్‌కు ఏమైంది? కర్రల సాయంతో బీబర్ షోకు వచ్చాడేంటి?

క్రికెట్ దేవుడు, టీమిండియా స్టార్ క్రికెట్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు ...

Widgets Magazine