మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By pnr
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (11:07 IST)

ఐపీఎల్ 2018 : చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లన్నీ పూణెలో..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై నగరంలోని చెప్పాక్కం స్టేడియంలో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను పూణెకు తరలించారు. కావేరీ జల నిర్వహణ మండలి ఏర్పాటు కోసం తమిళనా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ అంచె పోటీల్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చెన్నై నగరంలోని చెప్పాక్కం స్టేడియంలో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను పూణెకు తరలించారు. కావేరీ జల నిర్వహణ మండలి ఏర్పాటు కోసం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇందులోభాగంగా, చెన్నైలో జరిగే మ్యాచ్‌లను కూడా ఆందోళనకారులు అడ్డుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో మంగళవారం చెన్నైలో సీఎస్కే, కేకేఆర్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌ను కట్టుదిట్టమైన భద్రతనడుమ నిర్వహించారు. దీంతో మిగిలిన మ్యాచ్‌ల నిర్వహణకు ఆందోళనకారులు హెచ్చరికలు జారీచేశారు. దీంతో ఈ మైదానంలో ఆడాల్సిన అన్ని మ్యాచ్‌లను మరోచోటికి తరలించారు.
 
నిజానికి సీఎస్కే జట్టు ఆడాల్సిన మ్యాచ్‌ల కోసం నాలుగు నగరాల పేర్లను చెన్నై టీమ్ ముందు ఉంచినట్లు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ వెల్లడించారు. వీటిలో ఏపీలోని విశాఖపట్నంతోపాటు త్రివేండ్రం, పుణె, రాజ్‌కోట్ ఉన్నాయి. అయితే వీటిలోనూ పుణెను ఎంపిక చేసినట్టు సమాచారం.