Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జయలలిత మృతి.. అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డికి సమన్లు.. విచారణకు రావాలని?

మంగళవారం, 10 ఏప్రియల్ 2018 (16:25 IST)

Widgets Magazine
jayalalithaa

తమిళనాడు దివంగత సీఎం మృతిపై అపోలో గ్రూప్ ఛైర్మన్ ప్రతాప్ సీ రెడ్డిని విచారించాలని రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్ నిర్ణయించింది. జయమ్మ మృతి మిస్టరీపై విచారణ జరుపుతున్న రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగ స్వామి కమిషన్‌, జయకు తుది రోజుల్లో చికిత్స జరిపిన అపోలో గ్రూప్ చైర్మన్ ప్రతాప్‌ సీ రెడ్డి విచారణకు రావాలని ఆదేశాలు ఇచ్చింది. 
 
ఇందుకోసం, వారం రోజుల సమయం ఇస్తూ, నోటీసులు ఇచ్చేందుకు కమిషన్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే జయలలితకు అందించిన చికిత్స, చేసిన వైద్య పరీక్షల వివరాలను అపోలో చైర్మన్‌ ప్రతాప్‌ రెడ్డి, ఆయన కుమార్తె ప్రీతా రెడ్డి తరఫున ఆర్ముగ స్వామి కమిషన్‌కు ఆస్పత్రి అధికారులు నివేదికను పంపగా, మరికొన్ని అంశాల గురించి సమగ్రంగా విచారించేందుకు ప్రతాప్‌ సీ రెడ్డిని విచారణకు పిలవాలని కమిషన్ నిర్ణయించింది. ఒకటి రెండు రోజుల్లో ఆయనకు సమన్లు పంపి, ఆపై వారంలోపు విచారించాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. 
 
మరోవైపు జయలలిత మృతిపట్ల మిస్టరీని సాధ్యమైనంత వరకు తేల్చే దిశగా విచారణను వేగవంతం చేయాలని కమిషన్ భావిస్తోంది. ఇందులో భాగంగా, జయలలిత కేసులో ఇప్పటికే పలు కోణాల్లో విచారణ సాగిస్తున్న కమిషన్, ఇప్పటికే, జయకు సన్నిహితంగా ఉండే పలువురి నుంచి వాంగ్మూలాలను సేకరించిన సంగతి తెలిసిందే.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

''ఐటమ్ గర్ల్''గా ఛాన్స్ ఇస్తానని అత్యాచారం- వేరే యువతికి ఛాన్స్.. కేసు కొట్టివేత?

భోజ్‌పురి సినీ దర్శకుడు రాంకుమార్ కుమావత్ (51)పై వర్ధమాన నటి పెట్టిన అత్యాచారం కేసును ...

news

హోదా రాదని చంద్రబాబుకు తెలుసు.. వెంట్రుకతో కొండను లాగాలని?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాదని ఏపీ సీఎం చంద్రబాబుకు బాగా తెలుసునని.. వెంట్రుకతో ...

news

ఛాన్స్‌ కోసమెచ్చిన నటిపై దర్శకుడి అత్యాచారం.. కోర్టులో కేసు కొట్టివేత.. ఎలా?

ఓ యవతి సినీ దర్శకుడిపై పెట్టిన అత్యాచార కేసును న్యాయస్థానం కొట్టివేసింది. సినీ ఛాన్సుల ...

news

కార్పోరేట‌ర్ తిరుమ‌ల్ రెడ్డి రోడ్డు‌పై చిందులు... (వీడియో)

రోడ్డు‌పై ఎవ‌రైనా చిందులు వేసి హ‌ల్ చ‌ల్ చేస్తే... తాగేసి మందుబాబులు... అలా చేస్తుంటారు ...

Widgets Magazine