బుధవారం, 25 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By మోహన్
Last Updated : శుక్రవారం, 17 మే 2019 (18:20 IST)

తొలిసారి ప్రపంచకప్ ఆడేందుకు నేను ఆత్రుతగా ఉన్నాను: చాహల్

టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ 2019 ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్‌కు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ వేదికగా మే 30 నుంచి జరగనున్న ఈ టోర్నీ ఆడేందుకు చాలా ఆత్రుతతో ఉన్నానని తెలిపాడు.
 
'ఇది నా మొదటి వరల్డ్‌కప్. ఇందులో ఆడుతున్నందుకు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నా. ప్రతి ఒక్కరికీ దేశం తరపున వరల్డ్‌కప్‌లో ఆడాలని ఉంటుంది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్నప్పుడు వికెట్ కొంచెం నెమ్మదిగా ఉంది. ఇప్పుడెలా ఉందో అక్కడికి వెళ్తేగానీ, వికెట్ నేపథ్యం అర్థం కాదు. ప్రతి ఒక్కరినీ సపోర్ట్ చేస్తేనే జట్టుగా ముందుకు వెళ్లగలం' అని చాహల్ చెప్పుకొచ్చాడు.
 
కాగా ప్రపంచకప్ కోసం టీమిండియా మే 22న ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది. మే 25, 28న వార్మప్ మ్యాచ్‌లు ఆడి అక్కడి వాతావరణాన్ని పరిశీలించనుంది. దానిని బట్టి జూన్ 5వ తేదీన వరల్డ్‌కప్ టోర్నీలో జరగనున్న మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో ఆడేందుకు సిద్ధమవుతోంది.