Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్‌తో జాగ్రత్త.. మాల్వేర్ వచ్చేసింది... 232 యాప్స్‌‌తో డేంజర్

గురువారం, 11 జనవరి 2018 (15:56 IST)

Widgets Magazine
mobile phone

మొబైల్ బ్యాంకింగ్ యాప్స్ వినియోగిస్తున్నారా? కాస్త జాగ్రత్త సుమా.. ఎందుకంటే 12 బ్యాంకుల ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ అప్లికేషన్లకు సెక్యూరిటీ ముప్పు వుందట. ఈ మేరకు సదరు బ్యాంకులు కస్టమర్లకు హెచ్చరిక సందేశాలు పంపిస్తున్నాయి. అంతేగాకుండా సురక్షిత విధానంలో మొబైల్  బ్యాంకింగ్ యాప్స్ వినియోగించాలని సదరు బ్యాంకులు సూచిస్తున్నాయి. 
 
232 బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు చెందిన ఆండ్రాయిడ్ యాప్స్‌ను నుట్రోజన్ మాల్వేర్ లక్ష్యంగా చేసుకున్నట్లు సైబర్ భద్రతా సంస్థల్లో ఒకటైన క్విక్ హీరో సెక్యూరిటీ ల్యాబ్స్ గుర్తించింది. ఫలితంగా మాల్వేర్‌తో జాగ్రత్తగా వుండాలని సందేశాలు పంపుతున్నాయి.
 
క్విక్ హీల్ తన జాబితాలో చెప్పబడిన భారత బ్యాంకులు ఏవంటే.. హెచ్డీఎఫ్‌సీ, యాక్సిస్ మొబైల్, ఐసీఐసీఐ  బ్యాంక్ ఐ మొబైల్, ఐడీబీఐ బ్యాంగ్ గో మొబైల్ ప్లస్, ఐడీబీఐ బ్యాంక్ అభయ్, ఐడీబీఐ బ్యాంక్ గో మొబైల్, ఐడీబీఐ ఎంపాస్ బుక్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎం పాస్ బుక్, యూనియన్ బ్యాంకు, యాక్సిస్ మొబైల్ వంటి యాప్స్ వున్నాయి.
 
కస్టమర్ల లాగిన్ వివరాలను కాజేసేందుకు కస్టమర్లకు వచ్చే ఎస్ఎంఎస్‌లను హైజాక్ చేసేందుకు ఆండ్రాయిడ్ బ్యాంకర్ ఏ9480 పేరుతో పిలిచే మాల్వేర్‌‍ను డిజైన్ చేసినట్లు క్విక్ హీరో గుర్తించింది. నకిలీ ఫ్లాష్ ప్లేయర్ యాప్ ద్వారా ఈ మాల్వేర్ చొరబడుతున్నట్టు తేలింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

వాట్సాప్‌లో వచ్చిన కొత్త ఫీచర్ ఇదే...

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అదీ కూడా ఆండ్రాయిడ్ డివైస్‌లలో వాట్సాప్ ...

news

వాట్స్ యాప్ కొత్త ఫీచర్ ఏంటో తెలుసా?

వాట్సప్ ఆండ్రాయిడ్ బీటా వినియోగదారులు ఇప్పుడు వాట్సప్‌‌లో వాయిస్ కాల్ నుండి వీడియో ...

news

జియో సంక్రాంతి ఆఫర్.. రోజుకు 5జీబీ డేటా

రిలయన్స్ జియో మరో రెండు కొత్త ఆఫర్లను ప్రకటించింది. సంక్రాంతి ఆఫర్‌ కింద వీటిని తాజాగా ...

news

కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది...

కారు నడిపేటపుడు మీ బ్రెయిన్ ఉపయోగించడంలేదా? ఐతే మీ కారు ఉపయోగిస్తుంది... ఈ మాట వినేందుకు ...

Widgets Magazine