Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

జమ్మూకాశ్మీర్‌లో జియో లైసెన్స్‌ను రద్దు చేయాలి: ఎయిర్ టెల్ డిమాండ్

గురువారం, 1 జూన్ 2017 (09:16 IST)

Widgets Magazine
JioFi

జమ్మూకాశ్మీర్‌లో జియో లైసెన్స్‌ను రద్దు చేయాలంటూ ఎయిర్‌టెల్ డిమాండ్ చేస్తోంది. ఆ రాష్ట్రంలోని తమ వినియోగదారుల్లో 95 శాతం మంది పోస్ట్ పెయిడ్ వినియోగదారులుగా చెబుతోందని, నిజానికి వారంతా ప్రీపెయిడ్ కస్టమర్లేనని ఎయిర్‌టెల్ వాదిస్తోంది. నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న జియోతో భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆరోపిస్తోంది. 
 
దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఇస్తున్నట్టే వ్యూహాత్మకంగా, ఉద్దేశపూర్వకంగా ఉచిత ఆఫర్లు ఇస్తూ వినియోగదారులను జియో తమవైపు తిప్పుకుంటోందని, తద్వారా దేశ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఎయిర్‌టెల్ పేర్కొంది. అందుకే వెంటనే జియో లైసెన్స్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. అయితే ఎయిర్‌టెల్ ఆరోపణలు దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని, ప్రతీకార చర్యల్లో భాగంగానే ఇలాంటి ఆరోపణలు చేస్తోందని జియో ఫైర్ అయ్యింది.  
 
ఇదిలా ఉంటే.. జియో కొట్టిన దెబ్బకు ఇప్పటికీ ఇతర టెలికాం సంస్థలు కోలుకోలేదు. అయితే ఇకపై జియో బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సంస్థలకు కూడా గట్టి షాకే ఇవ్వనుంది. జియో ఫైబర్ పేరిట త్వ‌ర‌లో సరికొత్త, అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను యూజర్లకు అందించేందుకు సన్నాహాలు చేస్తున్న‌ట్టు తెలిసింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఆధార్ లేకుంటే? ఎయిర్‌టెల్, ఐడియా సిమ్‌లు ఇక పనిచేయవండోయ్!

భారత్‌లోని టెలికాం వినియోగదారులు త్వరలో ఆధార్ నెంబర్లను సమర్పించాలని సుప్రీం కోర్టు ...

news

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లపై జూడీ పంజా... ఇప్పటికే 3.6 కోట్ల ఫోన్లలో పాగా

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను పెనుముప్పు పొంచివుంది. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ...

news

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే2.. పంజాబ్‌లోనే అత్యధికంగా?

దేశంలోనే నెం.1 స్మార్ట్ ఫోన్‌గా శాంసంగ్ గెలాక్సీ జే 2 ఫోన్ అవతరించింది. ఇన్‌స్టాలెడ్ ...

news

నోకియాకు డూప్ వేస్తున్న మైక్రోమాక్స్ ఫీచర్ ఫోన్.. 4జీతో ఎక్స్1ఐ రిలీజ్..

నోకియా నుంచి 3310 ఫోన్లు మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్లు రూ.3310 ధర ...

Widgets Magazine