శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 30 నవంబరు 2018 (17:05 IST)

చైనాతో చతురు కాదు... ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ వైఫై ఇస్తుందట...

ఫ్రీ వైఫై... అంటే ఎగిరి గంతేయరూ స్మార్ట్ ఫోన్ యూజర్లూ... నిజంగా ఇదే జరిగితేనా? జరిగి తీరుతుంది అంటోంది చైనాలోని లింక్ ష్యూర్ నెట్వర్క్. ఐతే ఇది ఎప్పుడు జరుగుతుందయా అంటే మరో మూడు దశాబ్దాలు ఆగాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా ఫ్రీ వైఫై ఇచ్చేందుకు చైనాకు చెందిన లింక్ ష్యూర్ ప్రయోగాలు చేస్తోంది. ఇందుకోసం సుమారుగా రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తోంది. 
 
ఇందులో భాగంగా 272 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించి ఈ భూగోళంపై వున్నవారందరికీ ఉచితంగా వైఫై ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కానీ ఇక్కడే వుంది ఓ ట్విస్ట్. ఇది ఇప్పుడప్పుడే సాధ్యం కాదట. 2020లో 10 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతుందట. ఆ తర్వాత దశలవారీగా ఇలాంటి ఉపగ్రహాలను మొత్తం 272 పంపుతుందట. ఇవన్నీ పంపేసరికి 2026 సంవత్సరం దాకా పట్టే అవకాశం వుందని చెపుతోంది. 
 
ఏదేమైనా ప్రస్తుతానికి నెట్ చార్జీలు నేల చూపులు చూస్తున్నాయి. ఇక చైనా ఇలాంటి పని చేస్తే యూజర్లకు కొదవేముంటుంది. 24 గంటలూ నెట్ చూసుకుంటూ నిద్రలేకుండా వుంటారేమో?