శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 జులై 2016 (09:50 IST)

ఫేస్‌బుక్‌లో సరికొత్త ఫీచర్.. ఎందుకు.. ఎవరి కోసం?

ఫేస్‌బుక్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. లాభాపేక్ష లేని ఛారిటీ సంస్థలకు సాయపడేందుకు ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా విరాళాలను ఆన్‌లైన్‌లో పొందేందుకు వీలుపడుతుందని ఆ సంస్థ పేర్

ఫేస్‌బుక్ మరో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. లాభాపేక్ష లేని ఛారిటీ సంస్థలకు సాయపడేందుకు ఈ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. తద్వారా విరాళాలను ఆన్‌లైన్‌లో పొందేందుకు వీలుపడుతుందని ఆ సంస్థ పేర్కొంది.
 
ఈ అధునాతన ఫీచ్‌ర్‌ను అమెరికాలోని చారిటీ సంస్థలతో పాటు ఇకమీదట వ్యక్తిగత యూజర్లు సైతం వాడుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫండ్‌రైజర్స్ ఫీచర్ అమెరికాలోని ఒక శాతం యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చిందిని, వచ్చే కొద్దివారాల్లో మొత్తం యుఎస్ యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను పరిచయం చేస్తామన్నారు.
 
ఎన్‌జీఓలు నేరుగా ఫేస్‌బుక్‌ నుంచి విరాళాలు పొందవచ్చని సంస్థ ప్రొడక్ట్ మేనేజిమెంట్ ఫర్ట్ సోషల్ గుడ్ వైస్‌ ప్రెసిడెంట్ నవోమి గ్లెయిట్ ఒక ప్రకటనలో తెలిపారు. తాజా ఫీచర్‌తో యూజర్లు నేరుగా ఫేస్‌బుక్‌ ద్వారా డొనేషన్లు ఇవ్వవచ్చు.