శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (15:45 IST)

కలాం లేకపోయినా ట్విట్టర్ ఖాతా మాత్రం యాక్టివ్‌గా ఉంటుందట!

భారతరత్న, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం భౌతికంగా లేకపోయినా.. ట్విట్టర్ ఖాతా మాత్రం యాక్టివ్‌గా ఉంటుందని సమాచారం. అయితే కొత్త పేరుతో ఖాతాను కొనసాగించాలని ఆయనతో సన్నిహితంగా ఉండే సహాయకుల బృందం నిర్ణయించింది. 'ఇన్ మెమొరీ ఆఫ్ డాక్టర్ కలాం' పేరుతో ట్విట్టర్ ఖాతా కొనసాగుతుందని ఆయనకు సన్నిహితంగా ఉండే ఐఐఎం పూర్వ విద్యార్థి, సహచరుడు శ్రిజన్ పాల్ సింగ్ ట్విట్టర్‌లో తెలిపారు.
 
ఈ అకౌంట్ ద్వారా డాక్టర్ కలాం జ్ఞాపకాలను, స్ఫూర్తిదాయక సందేశాలను, ఉపన్యాసాలను శ్రిజన్ పాల్ ట్వీట్ చేయనున్నారు. అంతేగాక కలాం పుస్తకాలు 'వింగ్స్ ఆఫ్ ఫైర్','ఇండియా 2020','ఇగ్నిటెడ్ మైండ్స్', 'అనదర్ బుక్', 'అడ్వాంటేజ్ ఇండియా' వంటి పుస్తకాల్లోని కీలక సమాచారాన్ని ట్వీట్ చేయనున్నట్లు తెలిసింది. అలాగే ఇంకా ప్రచురితం కాని పుస్తకాల్లోని సమాచారాన్ని.. కలాం జీవిత విశేషాలను కూడా అందులో పొందుపరుచనున్నట్లు సమాచారం.