Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పోస్ట్ పెయిడ్ కస్టమర్లు జియో న్యూ ప్లాన్.. జస్ట్ రూ.199 మాత్రమే

శుక్రవారం, 11 మే 2018 (09:34 IST)

Widgets Magazine

దేశీయ టెలికాం విప్లవం రిలయన్స్ జియో సరికొత్త ప్లాన్‌ను ప్రకటించింది. తన పోస్ట్ పెయిడ్ కస్టమర్ల కోసం ఈ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ ధర రూ.199 మాత్రమే. ఈ నెల 15 నుంచి ఈ ప్లాన్ అమ్మకాలు మొదలవనుండగా, జీరో-టచ్ పేరుతో వచ్చిన ఇందులో కస్టమర్లకు నెలకు 25జీబీ డాటాతోపాటు అంతర్జాతీయ కాలింగ్, రోమింగ్ ప్రయోజనాలను కల్పించనుంది.
reliance jio
 
ముఖ్యంగా, ఈ ప్లాన్‌లో భాగంగా, అమెరికా, కెనడా కాల్స్‌కు నిమిషానికి కేవలం 50 పైసల చొప్పున కాల్ చార్జీని వసూలు చేయనుంది. అలాగే, బంగ్లాదేశ్, చైనా, ఫ్రాన్స్, ఇటలీ, న్యూజీలాండ్, సింగపూర్, బ్రిటన్‌లకు రూ.2, హాంకాంగ్, ఇండోనేషియా, మలేషియా, టర్కీలకు రూ.3, ఆస్ట్రేలియా, బహ్రెయిన్, పాకిస్థాన్, థాయిలాండ్‌లకు రూ.4, జర్మనీ, ఐర్లాండ్, జపాన్, కువైట్, రష్యా, వియత్నాంలకు రూ.5, ఇజ్రాయెల్, నైజీరియా, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, యూఏఈ, ఉజ్బెకిస్తాన్‌లకు రూ.6 చొప్పున వసూలు చేయనుంది.
 
ఇదిలావుంటే ఒకరోజు కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్ (భారత్‌తోపాటు విదేశాల్లో లోకల్ కాల్స్), ఎస్‌ఎమ్‌ఎస్, 250ఎంబీ హై-స్పీడ్ డాటా సౌకర్యం పొందాలంటే రూ.575 చెల్లించాలన్న జియో.. ఇదే 7 రోజులకు రూ.2,875, 30 రోజులకు రూ.5,751 చొప్పున చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. అయితే 30 రోజుల ప్లాన్‌లో రోజుకు 5జీబీ డాటా వస్తుందని చెప్పింది. 
 
అంతర్జాతీయ రోమింగ్‌ను కూడా రెండు టారీఫ్‌లలో అందుబాటులోకి తెచ్చిన జియో.. ఒక టారీఫ్‌లో వాయిస్ కాల్స్ నిమిషానికి రూ.2, మొబైల్ డాటా ఎంబీకి రూ.2, ఒక్కో మేసేజ్‌కి రూ.2 చొప్పున చార్జ్ చేస్తామని వివరించింది. మరో టారీఫ్‌లో వీటికి రూ.10 చొప్పున తీసుకుంటామని స్పష్టం చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఐబాల్ బెస్ట్ ఆఫర్.. రూ.13,999కే ల్యాప్‌టాప్

ఇపుడు ప్రతి ఒక్కరూ ల్యాప్‌టాప్‌లను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో వీటి ధరలు ...

news

ఎసి కెపాసిటీని టన్నుల్లో లెక్కిస్తారు.. ఎందుకో తెలుసా?

వేసవి ఎండలు మండిపోతున్నాయి. జనం అల్లాడిపోతున్నారు. కానీ ఎ.సి.లు, ఫ్యాన్లు, కూలర్లు అమ్మే ...

news

జియో నుంచి ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సేవలు... 1100జీబీ ఉచిత డేటా

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో త్వరలోనే ఫైబర్ బ్రాడ్ ...

news

అలాంటి మెసేజ్‌ను టచ్ చేస్తే మీ ఫోన్ అంతేసంగతులు..

అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేకొద్దీ కొత్తకొత్త సమస్యలు కూడా పుట్టుకొస్తున్నాయి. ...

Widgets Magazine