ఆకట్టుకునే ఫీచర్లతో ఎల్‌జీ వీ50 థిన్‌క్యూ స్మార్ట్‌ఫోన్..

మోహన్| Last Updated: మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (16:45 IST)
ఎలక్ట్రానిక్స్ తయారీదారైన ఎల్‌జీ సంస్థ తన నూతన నూత‌న స్మార్ట్‌ఫోన్ వీ50 థిన్‌క్యూను ఈ నెల 19వ తేదీన కొరియా మార్కెట్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ ఫోన్ రూ.73,105 ధరతో వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందించనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 
 
ఎల్‌జీ వీ50 థిన్‌క్యూ ప్రత్యేకతలు...
* 6.4 అంగుళాల డిస్‌ప్లే, 
* 3120 x 1440 పిక్స‌ెల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, 
* ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 855 ప్రాసెస‌ర్‌, 
* 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 
* 2 టీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 
* ఆండ్రాయిడ్ 9.0 పై, 
 
* 12, 16, 12 మెగాపిక్స‌ెల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 
* 8, 5 మెగాపిక్స‌ెల్ డ్యుయ‌ల్ సెల్ఫీ కెమెరాలు, 
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, ఐపీ 68 వాట‌ర్‌, 
 
* డ‌స్ట్ రెసిస్టెన్స్‌, 5జీ, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, 
* బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, 
 
* యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ అమర్చబడి ఉంటుంది.దీనిపై మరింత చదవండి :