శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By PNR
Last Updated : శనివారం, 29 ఆగస్టు 2015 (17:30 IST)

సోమవారం రోజున ఫేస్‌బుక్‌లో 100,00,00,000 మంది లాగిన్ అయ్యారట...

సామాజిక ప్రసార మాధ్యమాల్లో ఫేస్‌బుక్ ఒకటి. ఈ సంస్థ అధినేతగా జుకెన్‌బర్గ్ కొనసాగుతున్నారు. అయితే సోమవారం ఒక్క రోజునే ఫేస్‌బుక్‌లో వంద కోట్ల మంది లాగిన్‌ అయ్యారు. ఇలా జరగడం ఫేస్‌బుక్‌ చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
దీనిపై జూకెన్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ ద్వారా ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఫేస్‌బుక్ అనే ముఖపుస్తకం 2012 అక్టోబర్‌లో తన బిలియన్‌ వినియోగదారుడ్ని సంపాదించుకుందన్నారు. 
 
యవరేజ్‌గా నెలకు 150 కోట్ల మంది ఫేస్‌బుక్‌లో లాగిన్‌ అవుతున్నట్టు చెప్పారు. కానీ ఫస్ట్‌టైమ్‌ సోమవారం ఒక్కరోజే వంద కోట్లమంది లాగిన్‌ అయ్యారని, ఈ విధంగా సరికొత్త మైలురాయిని చేరుకోవడం ఇదే తొలిసారని చెప్పుకొచ్చారు.