Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఫేస్‌బుక్ ఖాతాదారులకు క్షమాపణలు చెప్చిన జుకర్ బర్గ్... ఎందుకు?

గురువారం, 22 మార్చి 2018 (14:12 IST)

Widgets Magazine
Mark Zuckerberg

పేస్‌బుక్ ఖాతాదారులకు ఆ సంస్థ సీఈవో జుకర్ బర్గ్ క్షమాపణలు చెప్పారు. కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం దుర్వినియోగమైందంటూ ప్రముఖ సోషల్‌మీడియా వెబ్‌సైట్‌ ఫేస్‌బుక్‌పై గత కొన్ని రోజులుగా ఆరోపణలు వెల్లువెత్తున్న సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో ఆరోపణలపై ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఎట్టకేలకు స్పందించారు. యూజర్ల సమాచారాన్ని రహస్యంగా ఉంచడంలో కంపెనీ నుంచి పొరబాటు జరిగిందని జుకర్‌బర్గ్‌ అంగీకరించారు. అయితే తమ పొరబాటును సరిదిద్దుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటివి మళ్లీ జరగకుండా డెవలరపర్లు, బిజినెస్‌ భాగస్వాములతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు తన ఫేస్‌బుక్‌ ఖాతాలో‌ సుదీర్ఘ పోస్టు పెట్టారు. 
 
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికా.. ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారుల సమాచారాన్ని దుర్వినియోగం చేసిందంటూ వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో గత కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికే ఈ విషయమై అమెరికాలోని శాన్‌జోస్‌ కోర్టులో కేసు కూడా నమోదైంది. మరోవైపు ఈ వ్యవహారం విషయంలో భారత్‌ కూడా ఫేస్‌బుక్‌ను గట్టిగా హెచ్చరించింది. భారత ఎన్నికల ప్రక్రియల్లో అక్రమ మార్గాల ద్వారా జోక్యం చేసుకుంటే సహించేది లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ హెచ్చరించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

కేంబ్రిడ్జ్ అనలిటికా స్కామ్‌.. జుకర్ బర్గ్ ఏమన్నారు? జర్మనీ యూజర్ల డేటా?

సామాజిక మాధ్యమాల్లో అగ్రగామి అయిన ఫేస్‌బుక్‌కు కొత్త చిక్కొచ్చి పడింది. యూజర్ల ...

news

బీఎస్ఎన్ఎల్‌ నుంచి త్వరలో 5జీ సేవలు.. వచ్చే ఏడాది నుంచే..?

రిలయన్స్ జియోకు పోటీగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను ప్రారంభించేందుకు రంగం ...

news

''జియోఫై'' వినియోగదారుల కోసం రిలయన్స్ బంపర్ ఆఫర్

దేశంలో ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో తాజాగా కొత్త ఆఫర్‌ని ...

news

జియోకు పోటీ.. బీఎస్ఎన్ఎల్ నుంచి రూ.448 కొత్త ప్లాన్

దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోకు పోటీగా ఆఫర్లు ప్రకటించేందుకు ...

Widgets Magazine