శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 21 ఏప్రియల్ 2015 (19:30 IST)

వై-ఫై రేంజి పెరగేందుకు కొత్త టెక్నాలజీ: ఓరెగాన్ వర్శిటీ కృషి.. వైఫో..?

ఓరెగాన్ యూనివర్శిటీ పరిశోధకులు వై-ఫై రేంజిని పెంచేందుకు కొత్త టెక్నాలజీని రూపకల్పన చేసారు. దీని సాయంతో వై-ఫై పరిధిని పది రెట్లు పెంచే అవకాశం ఉంటుంది. ఓరెగాన్ యూనివర్శిటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ఈ సాంకేతిక పరిజ్ఞానానికి 'వైఫో' అని నామకరణం చేశారు.
 
ఈ టెక్నాలజీలో ఎల్ఈడీ లైట్లు కీలక పాత్ర పోషిస్తాయి. రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టులు, రెస్టారెంట్ల వంటి ప్రదేశాల్లో వై-ఫై బ్యాండ్ విడ్త్ సమస్యలకు ఈ సాంకేతిక పరిజ్ఞానంతో అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
 
వైర్ లెస్ ట్రాన్స్ మిషన్ కోసం ఎల్ఈడీ కాంతి ప్రసారాన్ని వినియోగించుకోవడం ఈ టెక్నాలజీలో ప్రధాన సూత్రమని ఓరెగాన్ వర్శిటీ పరిశోధకులు తెలిపారు. ఈ టెక్నాలజీలో భాగంగా ఖరీదైన వస్తువులేవీ వినియోగించాల్సిన అవసరం లేకపోవడంతో వైఫో చవకగానే లభ్యం కానుంది. అన్నిరకాల వై-ఫై వ్యవస్థలతో ఇది పనిచేస్తుంది.