Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

షాకింగ్ న్యూస్ : జియో కస్టమర్ల సమాచారం లీక్?

సోమవారం, 10 జులై 2017 (11:11 IST)

Widgets Magazine
reliance jio digital

షాకింగ్ న్యూస్. రిలయన్స్ జియో కస్టమర్ల సమాచారం లీక్ అవుతోంది. కస్టమర్ డేటాబేస్ హ్యాక్ అయిందని, ఈ క్రమంలోనే magicapk.com అనే వెబ్‌సైట్‌లో జియో యూజర్ల పూర్తి వివరాలు దర్శనమిస్తున్నట్టు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ లింక్‌ను కూడా పలువురు నెటిజన్లు పోస్ట్ చేశారు. 
 
దేశంలో జియో టెలికాం సేవలు ఓ విప్లవాన్ని సృష్టించిన విషయం తెల్సిందే. అలాగే, టెలికాం రంగంలో కూడా శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం జియోకు 12 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం జియోలో ఉన్న 12 కోట్ల మంది కస్టమర్ల సమాచారం లీకైందని ఓ వెబ్‌సైట్ వెల్లడించింది. 
 
జియో కస్టమర్లకు చెందిన ఫోన్ నంబర్, చిరునామా, ఈ-మెయిల్ ఐడీ వంటి వివరాలతోపాటు ఆధార్ నంబర్లు కూడా సదరు వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయని, మన దేశంలో ఇప్పటివరకు ఇలా అత్యంత భారీ ఎత్తున డేటా లీక్ అవడం ఇదే తొలిసారి అని పలు టెక్ వెబ్‌సైట్లు పేర్కొంటున్నాయి. 
 
అయితే ఈ వార్తలపై జియో స్పందించింది. తన కస్టమర్ డేటాబేస్ ఏ మాత్రం హ్యాక్ కాలేదని, వారి వివరాలు, సమాచారం అంతా సురక్షితంగా ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని జియో ప్రతినిధి ఒకరు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం ఈ విషయం పట్ల విచారణ చేస్తున్నామని, డేటా లీక్ అయిందనే సమాచారం మాత్రం నిజం కాదని, అవి కేవలం వదంతులే అని కొట్టి పారేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

ఉద్యోగి తొలగింపులో అడ్డంగా దొరికిపోయిన టెక్ మహేంద్రా.. సారీ చెబితే ఏంటి.. పరువు పోయె

ఒక ఉద్యోగిని అర్థంతరంగా కంపెనీ నుంచి తొలగిస్తున్న సమయంలో హెచ్ ఆర్ డిపార్ట్‌మెంట్ ...

news

చార్జింగ్‌ కాదు కదా అసలు బ్యాటరీయే అక్కర్లేని ఫోను...

సాధారణంగా చేతిలో మొబైల్ ఉంటే ఖచ్చితంగా జైబులో చార్జరో, పవర్ బ్యాంకో ఉండాల్సిందే. లేకుంటే ...

news

4జీ టెక్నాలజీతో పనిచేసే.. ఫీచర్ ఫోన్ రూ.500లకే.. ఎవరిస్తున్నారు..?

టెలికం మార్కెట్లో మరో సంచనలనానికి రిలయన్స్ జియో రెడీ అయింది. అతి త్వరలో అత్యంత చౌక ధరలో ...

news

వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్: ఇకపై ఫాంట్ ఈజీగా మార్చుకోవచ్చు..

వాట్సాప్ లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే? ఇకపై ఫాంట్ స్టైల్‌ను సులభంగా మార్చుకునే వీలుంటుంది. ...

Widgets Magazine