Widgets Magazine

ప్రీపెయిడ్ కస్టమర్లకు జియో గుడ్‌న్యూస్.. హాలిడే హంగామా పేరుతో...

శుక్రవారం, 1 జూన్ 2018 (10:46 IST)

Widgets Magazine

దేశీయ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన రిలయన్స్ జియో... తాజాగా తన ప్రీపెయిడ్ మొబైల్ యూజర్ల కోసం సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. మోస్ట్ పాపులర్ ప్యాక్‌గా గుర్తింపు పొందిన రూ.399పై రూ.50 క్యాష్‌బ్యాక్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
reliance jio
 
మై జియోలోని ఫోన్‌పే ద్వారా రూ.399 ప్యాక్‌ను కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ.50 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. నేటి నుంచి ఈనెల 15 వరకు మాత్రమే ఆఫర్ అమలులో ఉంటుంది. రూ.399 ప్యాక్‌లో వినియోగదారులకు 84 రోజుల కాలపరిమితితో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు వంద ఎస్ఎంఎస్‌లు, 1.5 జీబీ డేటా లభిస్తుంది. 
 
కాగా, రూ.399 రీచార్జ్ ప్యాక్‌పై ఇప్పటికే రూ.50 విలువైన డిస్కౌంట్ ఓచర్లు అందిస్తోంది. దీనికి ప్రస్తుతం ప్రకటించిన క్యాష్ బ్యాక్ అదనం. అంటే రూ.399 విలువైన ప్యాక్ 100 రూపాయల రాయితీతో రూ.299కే లభిస్తుందన్నమాట. ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన 'ఫోన్‌పే'తో ఒప్పందం కుదుర్చుకున్న జియో 'హాలీడే హంగామా' పేరుతో ఈ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
హాలిడే హంగామా ప్రీపెయిడ్ కస్టమర్లు క్యాష్ బ్యాక్ ఎయిర్‌ టెల్ ఐడియా Idia Holiday Hungama Prepaid Users Air Tel Reliance Jio Cash Back రిలయన్స్ జియో

Loading comments ...

ఐటీ

news

ఐఫోన్ ఎక్స్ ఫీచర్స్‌తో ఎంఐ 8.. త్వరలో భారత్‌లోకి...

చైనాకు చెందిన మొబైల్ తయారీ దిగ్గజం షియోమీ తన తాజా మోడల్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ...

news

మార్కెట్‌లోకి పతంజలి సిమ్ కార్డులు.. ఆరోగ్య బీమా కూడా...

పతంజలి సంస్థ ద్వారా వివిధ రకాల ఉత్పత్తులతో మార్కెట్‌లోకి అడుగుపెట్టిన యోగా గురువు బాబా ...

news

జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్...

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియోకు ధీటుగా ఎయిర్‌టెల్ సరికొత్త ప్లాన్‌ను అందుబాటులోకి ...

news

జియో బంపర్ ఆఫర్... ఉచితంగా 8 జీబీ డేటా

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన కస్టమర్లందరికీ ఉచితంగా 8 జీబీ డేటాను ...