Widgets Magazine

రిలయన్స్ జియో కొత్త ప్లాన్.. జియో లింక్ పేరుతో.. 90 రోజులు ఉచిత డేటా

మంగళవారం, 26 జూన్ 2018 (11:02 IST)

దేశ వ్యాప్తంగా ఉచిత డేటాతో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో ప్రస్తుతం తన వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకునే దిశగా సరికొత్త సేవలను తీసుకురాబోతుంది. ఇందులో భాగంగా జియో లింక్ పేరుతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త సేవలను ప్రారంభించింది. దశల వారీగా ఈ సేవలు దేశ వ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు జియో రంగం సిద్ధం చేస్తోంది.
 
ఈ ప్లాన్‌లో భాగంగా రూ. 2,500తో సెట్ టాప్ బాక్సును పోలి ఉండే ఒక చిన్న పరికరాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. శాటిలైట్ డిష్ లాంటి ఒక చిన్న పరికరాన్ని భవనం పైభాగంలో అమర్చి, కేబుల్ ద్వారా భవనంలోని రూటర్‌కు కలుపుతారు. దీని ద్వారా హైస్పీడ్ వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. ఈ జియో లింక్ ద్వారా 90 రోజుల వరకు ఈ సేవలు ఉచితంగా లభిస్తాయి. ఆ తర్వాత రూ. 699తో రోజుకు 5జీబీ డేటా వంతున 28 రోజుల వరకు... రూ. 2,099తో రోజుకు 5జీబీ డేటా వంతున 98 రోజుల వరకు సేవలను పొందవచ్చునని జియో ఓ  ప్రకటనలో వెల్లడించింది. 
 
అలాగే రూ. 4,199తో 196 రోజుల వరకు డేటా పొందే ప్లాన్ కూడా వుంది. ఇకపోతే ఈ ప్లాన్ ద్వారా నేరుగా వాయిస్ కాల్స్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ, ఫేస్‌బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చునని జియో ప్రకటించింది. హోటల్స్, మాల్స్, కార్యాలయాలు, అపార్ట్ మెంట్లు తదితర ప్రాంతాల్లో జియో లింక్ ఇండోర్ వైఫై హాట్ స్పాట్‌గా ఉపయోగపడుతున్న సంగతి తెలిసిందే. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

అలా చేస్తే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... వారికి మాత్రమే...

అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ ఉచితంగా లభించనుంది. ఇందుకోసం నెటిజన్లు లేదా మొబైల్ ...

news

ఉద్యోగినితో ఇంటెల్ సీఈవో అక్రమ సంబంధం.. ఊడిన ఉద్యోగం

ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ఇంటెల్ సీఈవో బ్రియాన్ జానిచ్ ఉద్యోగం ఊడింది. తమ సంస్థలో పని చేసే ...

news

జియో మరో బంపర్ ఆఫర్... రోజూ 4.5జీబీ డేటా ఫ్రీ

టెలికాం రంగ సంచలనం రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. తమ మొబైల్ వినియోగదారులు ...

news

రిలయన్స్ జియో అదుర్స్.. అన్నీ ప్లాన్లలో అదనంగా ఉచిత డేటా..!

ఉచిత డేటా పేరిట దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. టెలికాం రంగం సంస్థలకు ...