శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2016 (11:15 IST)

పెద్దగా శ్రమించకుండానే రిలయన్స్ జియో సిమ్ కార్డు కావాలా?

రిలయన్స్ జియో సిమ్ కార్డు కోసం అనేక మంది నానా తిప్పలు పడుతున్నారు. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ స్టోర్ల ముందు సిమ్‌ల కోసం క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, పెద్దగా శ్రమించ

రిలయన్స్ జియో సిమ్ కార్డు కోసం అనేక మంది నానా తిప్పలు పడుతున్నారు. రిలయన్స్ డిజిటల్ స్టోర్లు, రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ స్టోర్ల ముందు సిమ్‌ల కోసం క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, పెద్దగా శ్రమించకుండానే జియో సిమ్ కార్డు పొందే సౌకర్యాన్ని రిలయన్స్ సంస్థ చేపట్టింది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. 
 
ఇందులోభాగంగా 1800-200-200-2 నెంబరుకు మీ ఫోన్ నుంచి కాల్ చేయాలి. ఆపై మీ ఫోన్‌కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో ఉన్న లింక్‌ను క్లిక్ చేస్తే, ప్లే స్టోర్ నుంచి 'మైజియో' యాప్ డౌన్‌లోడ్ అవుతుంది. దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేయగానే మొట్టమొదట 'గెట్ జియో సిమ్' అన్న బ్యానర్ కనిపిస్తుంది. 
 
ఆపై నిబంధనలను అంగీకరించి, 'గెట్ జియో సిమ్ ఆఫర్'పై క్లిక్ చేస్తే, మీ లొకేషన్‌ను తెలియజేయాలన్న మెసేజ్ వస్తుంది. మీరెక్కడుంటారో చెప్పి, నెక్ట్స్ బటన్ క్లిక్ చేస్తే, మీ మొబైల్ స్క్రీన్‌పై 'ఆఫర్ కోడ్' కనిపిస్తుంది. ఈ ఆఫర్ కోడ్‌తో పాటు ఐడీ ప్రూఫ్, ఫోటో, రెసిడెన్స్ ప్రూఫ్ తదితరాలను తీసుకుని రిలయన్స్ స్టోర్‌కు వెళితే, వెంటనే సిమ్ లభిస్తుందని తెలిపింది.