శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో? వారికి ఈ హెచ్చరికా.....

మంగళవారం, 3 జులై 2018 (17:40 IST)

శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఎవరైతే వాడుతున్నారో వారు తీసుకోవలసిన జాగ్రత్తలు. కొన్ని డివైజ్‌లు, మెుబైల్ యూజర్లు స్టోర్ చేసుకున్న ఫోటోలను వారి అనుమతి లేకుండా స్మార్ట్‌ఫోన్‌లోని ఇతర కాంటాక్ట్‌లకు పంపుతున్నట్లుగా సమాచారం అందింది. శాంసంగ్ మెసేజస్ కలిగి ఉన్నవారికి ఈ సమస్య తలెత్తిన్నట్లు గిజ్‌మోడో తొలుత రిపోర్టు చేసింది.
 
ఫైల్స్‌ను పంపుతున్నప్పటికి దాన్ని యూజర్లకు కూడా తెలుపడం లేదని రిపోర్టు తెలియజేసింది. ఈ శాంసంగ్ ఫోన్లలో శాంసంగ్ మెసేజస్ అనేది ఒక డిఫాల్ట్ మెసేజింగ్ యాప్. దీనిలోని బగ్ కారణంగా ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలిసింది. గెలాక్సీ ఎస్9, గెలాక్సీ ఎస్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్స్ డివైజ్‌లు దీని బారిన పడ్డాయి. కేవలం ఈ రెండు మోడల్స్ మాత్రమే ఈ సమస్య పరిమితం కాలేదని వెర్జ్ రిపోర్టులో వెల్లడైంది.
 
ఈ రిపోర్టులు తమ దృష్టికి వచ్చాయని, తమ టెక్నికల్ టీమ్స్ దీన్ని విచారిస్తున్నరని శాంసంగ్ ప్రకటనను విడుదల చేసింది. దీని బారిన పడిన కస్టమర్ల 1-800-శాంసంగ్ వద్ద తమను డైరెక్ట్‌గా చేయవలసినదిగా శాంసంగ్ కోరింది. అనుమతి లేకుండా ఫోటోలను, డేటాను కాంటాక్ట్‌లకు పంపే బగ్ బారిన పడకుండా ఉండేందుకు శాంసంగ్ మెసేజస్ అనుమతులను యూజర్లు ఉపసంహరించుకోవచ్చని శాంసంగ్ తెలియజేసింది.దీనిపై మరింత చదవండి :  
శాంసంగ్ స్మార్ట్‌ఫోన్స్ ఫోటోలు మెసేజస్ కాంటాక్ట్‌లకు టెక్నాలజీ Technology Data Samsung Owners Messages Photos Contacts Users Smart Phone

Loading comments ...

ఐటీ

news

ఇదే జియో ఫోన్ మాన్‌సూన్ హంగామా ఆఫర్... ముకేష్ అంబానీ

ప్రియమైన మిత్రులారా, మా డిజిటల్ సర్వీసెస్ చొరవ అయిన రిలయన్స్ జియోతో నేను ...

news

సంచలనాలకు తెరతీసిన జియో... ఫీచర్లు ఏంటి?

దేశీయ టెలికాం రంగంలో జియో సంచలనాలు కొనసాగుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ 41వ వార్షిక ...

news

బహిరంగ ప్రదేశాల్లో కూడా వైఫై సేవలు.. చర్చల్లో గూగుల్

ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే వైఫై సేవలు అందుబాటులో ...

news

ఇకపై జియో గిగా ఫైబర్‌ సేవలు.. ముకేశ్ అంబానీ

రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌తో ఇంట్లో ఉన్న ...