శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 5 మార్చి 2015 (17:20 IST)

స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్ లైన్ కొనుగోళ్లు వంద శాతం పెంపు!

మనదేశంలో స్మార్ట్ ఫోన్ ద్వారా ఆన్ లైన్‌లో కొనుగోళ్లు చేసే వారి సంఖ్య వంద శాతం పెరిగిందని తేటతెల్లమైంది. ప్రస్తుతం ఆన్ లైన్ కొనుగోళ్లు ప్రయోజనకరంగా మారాయని తెలిసినట్టు 'మాస్టర్ కార్డ్ ఆన్ లైన్ షాపింగ్ సర్వే-2014' ఓ నివేదిక విడుదల చేసింది. ఆసియా పసిఫిక్‌లోని 14 దేశాల్లో జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. 70.1 శాతంతో మొబైల్ షాపింగ్‌లో చైనా తొలి స్థానంలో నిలిచింది. 
 
చాలావరకు మొబైల్ ఉపయోగించే షాపింగ్ చేస్తున్నట్టు పోలింగ్‌లో తెలిపారు. భారత్ 62.9 శాతం, తైవాన్ 62.6 శాతం, థాయ్ లాంగ్ 58.8 శాతం, ఇండోనేషియా 54.9 శాతంతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. భారత్‌లో దుకాణాలకు వెళ్లి మరీ షాపింగ్ చేసే సామర్థ్యం 47.7 శాతం మాత్రమే ఉందని సర్వే వెల్లడించింది. 
 
అయితే యాప్‌లు అందుబాటులోకి వచ్చాక షాపింగ్ (45.3 శాతం మంది) చేసేవారికి అత్యంత సౌకర్యంగా మారిందని వివరించింది. ఈ షాపింగ్ స్మార్ట్ ఫోన్ ద్వారా కొనుగోలు చేసే వస్తువుల్లో మొబైల్ ఫోన్ లు లేదా మొబైల్ గాడ్జెట్ యాప్స్ (28.8 శాతం)లు ఎక్కువగా ఉన్నాయట.