శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (14:46 IST)

ప్రేమికుల దినోత్సవం.. వీవో ఫోన్లపై అమేజాన్ ఆఫర్లు..

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ డాట్ ఇన్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా వివో ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లతో కార్నివాల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆఫర్లు, డ

ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమేజాన్ డాట్ ఇన్ ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ముఖ్యంగా వివో ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్లతో కార్నివాల్ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఆఫర్లు, డిస్కౌంట్లను అమేజాన్ ప్రకటించింది. ఇకపోతే.. వివో లిమిటెడ్ ఎడిషన్ అయిన మనీష్ మల్హోత్రా వి7 హ్యాండ్ సెట్ ధర రూ.22,900. ఈ హ్యాండ్ సెట్ రెడ్ కలర్‌లో వుంటుంది.
 
అలాగే రూ.500 విలువైన ఫెర్న్స్ అండ్ పెటల్స్ వోచర్, బుక్ మై షోలో రూ.500 విలువకు సమానమైన మూవీ టికెట్స్ ఆఫర్ చేస్తోంది. అలాగే ఎక్చేంజ్ కింద రూ.18,752 వరకు తగ్గింపు పొందే అవకాశం ఉంది. 
 
డిస్కౌంట్లు: 
వివో వి7 ధర రూ.18,990 కాగా, తగ్గింపు కింద రూ.16,990కే లభిస్తుంది. 
వి5 ప్లస్ రూ.6,000 తగ్గింపుతో రూ.19,990కే లభిస్తోంది. 
కానీ వివో వి7 రెగ్యులర్ వెర్షన్ ధర రూ.21,999. దీనిపై ఎటువంటి తగ్గింపు లేదు. ఎక్సేంజ్ పై రూ.2,000 వరకే తగ్గింపును ఇస్తున్నట్లు అమేజాన్ ప్రకటించింది.