గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (14:38 IST)

వొడాఫోన్ వినియోగదారులకు శుభవార్త.. కొత్తగా 2 ప్లాన్స్...

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థల్లో ఒకటైన వొడాఫోన్ తన వినియోగదారుల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటి వ్యాలిడిటీ 30, 31 రోజులుగా నిర్ణయించింది. నెల రోజుల ప్లాన్‌ను ప్రతి నెల అదే రోజు రిచార్జ్ చేసుకునే విధంగా ఉండాలన్నది ఇటీవల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) ఆదేశించింది. దీంతో వొడాఫోన్ నెల రోజుల వ్యాలిడిటీతో కొత్ ప్లాన్ వోచర్లను అందుబాటులోకి తెచ్చింది. 
 
రూ.327 ప్లాన్‌లో 30 రోజుల కాలపరిమితి ఉంటుంది. రోజువారీ డేటా పరిమితి కాకుండా, ప్లాన్ కాల వ్యవధిలో మొత్తం 25 జీబీ డేటాను వాడుకోవచ్చు. ప్రతి రోజూ 100 ఎస్ఎంఎస్‌లను ఆఫర్ చేస్తుంది. అపరిమిత కాల్స్‌కు అదనంగా, వీఐ మూవీస్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా ఇస్తుంది.
 
ఇకపోతే రూ.337 ప్లాన్‌ కాలపరిమితి 31 రోజులపాటు ఉంటుంది. ఇందులో రోజువారీ డేటా కాకుండా ప్లాన్ కాల వ్యవధిలో 28 జీవీ డేటాను అందిస్తుంది. రోజూ 100 ఎస్ఎంఎస్‌లు ఇస్తుంది. అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్‌తో పాటు వీఐ మూవీస్, టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఉచితంగా ఇస్తుంది.