Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వాట్సాప్ సర్వర్ క్రాష్... సేవలకు అంతరాయం

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (13:03 IST)

Widgets Magazine
WhatsApp

సామాజిక ప్రసార మాద్యమాల్లో ఒకటైన వాట్సాప్ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. దీనికి కారణం సర్వర్ క్రాష్ కావడమే. ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. అయితే, భారత్‌లో మాత్రం వాట్సాప్ సేవలకు ఎలాంటి అంతరాయం ఏర్పడలేదు. 
 
భారత కాలమానం ప్రకారం నవంబర్ 30వ తేదీ గురువారం రాత్రి 11 తర్వాత అంటే అర్థరాత్రి సమయంలో ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సర్వీసులు నిలిచిపోయాయి. ఆ సమయంలో సర్వర్‌ క్రాష్ కావడంతో వీటి సర్వీసులకు బ్రేక్ పడింది. అర్థరాత్రి కావటం అందరూ నిద్రలో ఉండటంతో భారత్‌లో పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. కానీ, ఇంగ్లండ్, యూరప్ దేశాలు, దక్షిణ అమెరికాల్లో మాత్రం వాట్సాప్ బ్రేక్‌డౌన్ కావటం కలకలం రేపింది. పెద్ద ఎత్తున కస్టమర్లు ఫిర్యాదులు చేశారు. 
 
దీనిపై వాట్సాప్ ప్రతినిధులు స్పందిస్తూ, సర్వర్ క్రాష్ అయిన మాట వాస్తవమే అన్నారు. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ప్రాబ్లమ్ సాల్వ్ చేశామని.. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. సాధారణంగానే పని చేస్తుందని వారు ఓ ప్రెస్ నోట్‌ను రిలీజ్ చేశారు. కాగా, గత రెండు నెలల్లో వాట్సాప్ సర్వీస్ బ్రేక్ డౌన్ కావటం ఇది మూడోసారి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఐటీ

news

స్మార్ట్ ఫోన్లకు డేంజర్ యాప్స్ ఇవే... ఆ రెండు వద్దనే వద్దు...

చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లలో ట్రూ కాలర్‌, షేరిట్‌, యూసీ బ్రౌజర్‌ వంటి యాప్స్‌‌ను ...

news

రెడ్ మీ 5ఏ ఫోన్లపై బంపర్ ఆఫర్.. ఓన్లీ ఇండియన్ కస్టమర్లకే...

చైనా మొబైల్ దిగ్గజం షియోమీ తమ సరికొత్త మొబైల్‌ "5ఏ"ను భారతీయ మొబైల్ మార్కెట్‌లోకి విడుదల ...

news

భారత మార్కెట్లోకి రెడ్ మీ 5ఏ: ఫీచర్స్.. ఫస్ట్ లుక్ (వీడియో)

భారత మార్కెట్లోకి షియోమి సంస్థ కొత్త స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. అది కూడా చౌక ధరకే. ...

news

జియో యూజర్లకు గుడ్‌న్యూస్...

తమ యూజర్లకు రిలయన్స్ జియో ఓ శుభవార్త తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ట్రిపుల్ క్యాష్ ...

Widgets Magazine