వాట్సాప్ న్యూ ఫీచర్: చాటింగ్ చేస్తూ యూట్యూబ్ చూడొచ్చు

బుధవారం, 29 నవంబరు 2017 (10:02 IST)

whatsapp

సామాజిక ప్రసారమాధ్యమాల్లో ఒకటైన వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. దీనిద్వారా చాటింగ్ చేస్తూ యూట్యూబ్ చూడొచ్చు. అంటే మెసేజ్‌లో భాగంగా పంపే యూట్యూబ్‌ వీడియోలను చూడాలంటే ఇక వాట్సాప్‌ను వీడాల్సిన అవసరంలేదు. చాట్‌లో భాగంగానే వీటిని అక్కడే ప్లే చేసుకొని చూడొచ్చు. ఐవోఎస్‌ వినియోగదారుల కోసం ఈ సరికొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ తీసుకొచ్చింది.
 
చాట్‌లో భాగంగా ఏదైనా యూట్యూబ్‌ వీడియో లింక్‌ను పంపిస్తే.. ఇకపై ఆ వీడియోను వాట్సాప్‌లోనే చూసుకోవచ్చు. ఆ వీడియోను చూస్తూ చాట్‌ చేసుకోవచ్చు. ఇతర చాట్‌లోకి కూడా వెళ్లవచ్చు. 
 
గతంలో ఎవరైనా పంపిన యూట్యూబ్‌ వీడియో లింక్‌ను క్లిక్‌ చేస్తే అది యూట్యూబ్‌ యాప్‌లోకి వెళ్లి ప్లే అయ్యేది. దీంతో వాట్సాప్‌ నుంచి యూజర్‌ యూట్యూబ్‌కు వెళ్లాల్సివచ్చేది. ఇపుడు అలాంటి ఇబ్బంది లేకుండా నేరుగా చాటింగ్ మధ్యలోనే వీడియోను చూసుకునే సదుపాయం లభించనుంది. దీనిపై మరింత చదవండి :  
Whatsapp Iphone Youtube Videos Lock Voice Recording

Loading comments ...

ఐటీ

news

జియో గుడ్ న్యూస్ : 4జీ ఫీచర్ ఫోన్ సెకండ్ సేల్

దేశీయ టెలికాం సంచలనం రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఓ శుభవార్త చెప్పింది. జియో ...

news

ఆర్థిక లావాదేవీలకు ఎస్బీఐ కొత్త మొబైల్ అప్లికేషన్ యోనో

దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాకింగ్ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు అన్ని రకాల ఆర్థిక లావాదేవీల ...

news

ఎయిర్‌టెల్ మరో కొత్త ఆఫర్.. సెలెక్టడ్ కస్టమర్లకు మాత్రమే...

ప్రైవేట్ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ సంస్థ తమ ప్రీపెయిడ్ వినియోదారుల కోసం సరికొత్త ఆఫర్‌ను ...

news

నోకియా 2: జియోతో కలిసి బండిల్ ఆఫర్.. ఉచిత డేటా

గ్లోబల్ మొబైల్ మార్కెట్లో నోకియాకు పూర్వవైభవం తెచ్చేందుకు నోకియాను కైవసం చేసుకున్న ...