మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 సెప్టెంబరు 2018 (15:38 IST)

వాట్సాప్‌లో న్యూ ఫీచర్.. ఏంటో తెలుసా?

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో రెండు సరికొత్త యాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉండనున్నాయి. అందులో ఒకటి డార్క్ మోడ్ ఫీచర్. ఈ తరహా యాప్ ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్‌లో ఉ

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో రెండు సరికొత్త యాప్‌లు అందుబాటులోకి రానున్నాయి. ఇవి యూజర్లకు మరింత సౌలభ్యంగా ఉండనున్నాయి. అందులో ఒకటి డార్క్ మోడ్ ఫీచర్. ఈ తరహా యాప్ ఇప్పటికే యూట్యూబ్, ట్విట్టర్‌లో ఉంది.
 
ఈ డార్క్ మోడ్ ఫీచర్ వల్ల రాత్రిపూట వాట్సాప్‌ను వాడే యూజర్లు కంటిపై పడే వెలుతురు నుంచి విముక్తులు కావొచ్చు. ఈ ఫీచర్‌ను ఆన్ చేయడం వల్ల యాప్ స్క్రీన్ మొత్తం నల్లగా మారుతుంది. దీంతో చీకట్లో ఉన్నప్పుడు ఫోన్ తెరను చూసినా కళ్లపై పెద్దగా ప్రభావం ఉండదు. 
 
ఇక వాట్సాప్‌లో రానున్న మరో ఫీచర్ ఏమిటంటే... ఇప్పటివరకు వాట్సాప్‌లో వచ్చే మెసేజ్‌లకు రిప్లై ఇవ్వాలంటే ఆ మెసేజ్ లాంగ్ ప్రెస్ చేసి రిప్లై ఇవ్వాల్సి వచ్చేది. అయితే ఇకపై ఇలాంటి ఇబ్బంది ఉండదు. 
 
త్వరలో వాట్సాప్‌లో స్వైప్ టు రిప్లై ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీనివల్ల మెసేజ్ కుడివైపుకు స్వైప్ చేస్తే చాలు.. సులభంగా ఆ మెసేజుకు రిప్లై పంపుకోవచ్చు. వాట్సాప్ అందుబాటులోకి తీసుకునిరానున్న ఈ రెండు కొత్త యాప్‌లు అతి త్వరలో అందుబాటులోకి రానున్నాయి.