శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జగన్ మోహన్ రెడ్డి
Written By TJ
Last Modified: శుక్రవారం, 5 జనవరి 2018 (13:30 IST)

కుప్పంలో బాబును ఘోరంగా ఓడించండి... జగన్ మోహన్ రెడ్డి పిలుపు

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో బిసిలు చాలామంది ఉన్నారు. బిసిలకు బాబు అన్యాయం చేస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు... ఎప్పటి నుంచో జరుగుతోంది. బిసిలందరూ ఐక్యమై చంద్రబాబును ఘోరంగా ఓడించండి. వైసిపి అభ్యర్థిని గెలిపించండి.. అభివృద్థి అంటే

ఎపి సిఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో బిసిలు చాలామంది ఉన్నారు. బిసిలకు బాబు అన్యాయం చేస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు... ఎప్పటి నుంచో జరుగుతోంది. బిసిలందరూ ఐక్యమై చంద్రబాబును ఘోరంగా ఓడించండి. వైసిపి అభ్యర్థిని గెలిపించండి.. అభివృద్థి అంటే ఏమిటో మీకు మేము చూపిస్తాం. 
 
మా పార్టీ అభ్యర్థి చంద్రమౌళి పక్కనే ఉన్నారు. ఆయనపై నమ్మకం ఉంచండి.. వైసిపి గెలుపు కుప్పం నుంచే ప్రారంభం కావాలి. చిత్తూరు జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న జగన్ ఎపి సిఎం చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం చేయని అభివృద్థి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ మరోవైపు వైసిపి అధికారంలోకి వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తుందో వివరించే ప్రయత్నం చేస్తున్నారు జగన్. 
 
పాదయాత్ర తరువాత బస్సు యాత్రను ప్రారంభిస్తానని, చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గం  కుప్పంలోని అన్ని గ్రామాలను తిరుగుతానని చెప్పారు జగన్. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో గెలుపొందేందుకు జగన్ ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించడం హాట్ టాపిక్‌గా మారుతోంది.