శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2017 (17:13 IST)

బుడతడు కాదు... చిచ్చరపిడుగు... కళ్ళకు గంతలు కట్టుకుని కీబోర్డు వాయించాడు...

చెన్నై నగరానికి చెందిన ఓ బుడుతడు ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. కళ్లకు గుడ్డ కట్టుకుని ఏకంగా ఏడు గంటల పాటు కీబోర్డును అలవోకగా వాయించాడు.

చెన్నై నగరానికి చెందిన ఓ బుడుతడు ప్రతి ఒక్కరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. కళ్లకు గుడ్డ కట్టుకుని ఏకంగా ఏడు గంటల పాటు కీబోర్డును అలవోకగా వాయించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... చెన్నై నగర శివారు ప్రాంతమైన నంగనల్లూరులో ఏజీఎస్ కాలనీ, ఎస్బీఐ కాలనీవాసులంతా కలిసి సంక్రాంతి వేడుకల్లో భాగంగా ప్రత్యేక సంగీత విభావరిని నిర్వహించారు. 
 
ఇందులో సాధనాలయాకు చెందిన సంగీత వాయిద్య కళాకారుడు గోకుల వరుణ్ అనే బాలుడు... తన రెండు కళ్లకు గంతలు కట్టుకుని కీ బోర్డును అద్భుతంగా వాయించి, ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. అంతేకాదండోయ్... చిత్రలేఖనం, వయలిన్, కరాటేల్లో కూడా ఈ చిన్నోడికి ప్రావీణ్యం ఉంది. ఇప్పటికే అనేక సంగీత పోటీల్లో పాల్గొన్న ఈ బాలుడు... అనేక అవార్డులు, రివార్డులను అందుకుని ప్రతి ఒక్కరితో శభాష్ అని అనిపించుకుంటున్నాడు.